జాగింగ్ కు వెళ్లిన నటుడిపై మాటల యుద్ధానికి దిగిన నటి.. కారణం..?

ఒక సినిమాలో నటించే నటీనటుల పాత్రలు అందరికీ నచ్చాలని లేదు. కొంతమంది కి నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా కొందరు నటీనటులు.. వారు చూసిన సినిమాల పై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ ఒక్కోసారి ఇలాంటివి సమస్యలు కూడా తెచ్చిపెడతాయి అని తాజాగా జరిగిన ఓ సంఘటన ద్వారా స్పష్టమవుతుంది. ఇటీవల విడుదలైన ‘ఇరవిన్‌ నిగల్‌’ చిత్రంలో రేఖ నాయర్ పాత్ర, సహ నటి చిత్ర తో సంబంధం పై నటుడు బయిల్‌వాన్‌ రంగనాథ్‌ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది కూడా. ఈ వీడియో రంగనాథ్‌, రేఖల మధ్య చిచ్చు పెట్టింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా..తాజాగా చెన్నై బీచ్‌లో జాగింగ్‌ కోసం అని వెళ్లిన రేఖకు రంగనాథ్‌ ఎదురుపడ్డారు. అంతే ఆయన్ని చూడగానే రేఖ కోపంతో ఊగిపోయింది. దాన్ని కంట్రోల్ చేసుకోలేక రంగనాథ్ పై ఆమె మాటల యుద్ధానికి దిగింది. వీడియోలో రంగనాథ్ మాట్లాడిన తీరు గురించి ఆయన్ని నిలదీశారు రేఖ.

‘‘ మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి ఇలాగే మాట్లాడతారా? అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా?.. విషయం తెలియకుండా మాట్లాడకూడదు. నేను సినిమాలో ఎలాగైనా నటిస్తాను.. అలాగని… ఎలా పడితే అలా మాట్లాడతారా?. ఇలా చేస్తే మీ వయసుకు కూడా మర్యాద ఇవ్వను జాగ్రత్త. చెప్పు తెగుతుంది’’ అంటూ తిట్టేసింది.

అంతేకాకుండా బూతులు కూడా తిట్టినట్టు తెలుస్తుంది. గతంలో కూడా రంగనాథ్‌ వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. పలువురు నటీమణులపై ఆయన చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు మరోసారి రంగనాథ్‌ పై వివాదం చూడడం గమనార్హం.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus