Mahesh Babu: అలాంటి లక్షణాలున్న హీరో మహేష్ మాత్రమే.. డైరెక్టర్ చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu)  ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఎలాంటి పాత్రలోనైనా మహేష్ బాబు అలవోకగా అద్భుతంగా నటించగలరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినీ కెరీర్ లో పౌరాణిక పాత్రలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు ఏ దేవుని పాత్రలో నటించినా ఆ పాత్రకు న్యాయం చేయగలరని ఫ్యాన్స్ భావిస్తారు.

Mahesh Babu

బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చబ్రా మాట్లాడుతూ శ్రీరాముడి పాత్రలో కనిపించాలంటే చార్మింగ్ లుక్స్ ఉండాలని చిరునవ్వుతో అందరి ప్రేమను పొందగలగాలని అలాంటి లక్షణాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకు మాత్రమే ఉన్నాయని శ్రీరాముని పాత్రకు మహేష్ బాబు పర్ఫెక్ట్ అని పేర్కొన్నారు. కాస్టింగ్ డైరెక్టర్ కామెంట్లు విన్న మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

భవిష్యత్తులో మహేష్ బాబు శ్రీరాముని పాత్రలో కనిపిస్తారేమో చూడాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సైతం పౌరాణిక పాత్రలపై ఎక్కువగానే ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఆ పాత్రలను సరిగ్గా డీల్ చేసే దర్శకుల కోసం ఆయన ఎదురుచూస్తున్నారని సమాచారం అందుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి  (S. S. Rajamouli)  సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

రాజమౌళి స్పెషల్ కేర్ తీసుకోవడం వల్లే ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. 2027లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు రోల్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ ఇతర భాషల ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

కూతురికి చరణ్ ఇచ్చిన బహుమతి ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus