RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

భారీ సినిమాలు, అంతకంటే భారీ విజయాలు ఉన్న ఓ దర్శకుడు, మరో భారీ చిత్రాల దర్శకుడిని పొగిడితే… చూడటానికి చూడముచ్చటగా, సంబరంగా ఉంటుంది కదా. అలాంటి సీన్‌ శుక్రవారం రాత్రి జరిగింది. ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఓ ట్వీట్‌ చేశారు. రాత్రి 11 తర్వాత ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ గురించి ఆయన చెప్పిన మాటలు, అందులో కథానాయకులు, దర్శకుడు గురించి రాసిన పదాలు అంత బాగున్నాయి మరి.

Click Here To Watch NOW

‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా గురించి మాట్లాడుతూ.. అందరూ రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటన గురించి, డ్యాన్స్‌ గురించి, యాక్షన్‌ సీక్వెన్స్‌ల గురించి, అందులో వారి ప్రతిభ గురించి మాట్లాడుతున్నారు. రాజమౌళి గురించి అయితే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఆయన దర్శకత్వ ప్రతిభ, టేకింగ్‌, కథనాన్ని తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చుతోంది. దీంతో ప్రముఖ దర్శకులు చాలామంది సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి స్పందించారు.

ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. RRRకి కొత్త అర్ధాన్ని వివరిస్తూ మాకు ఒక అదిరిపోయే అనుభూతి ని ఇచ్చినందుకు చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు. రామ్ చరణ్ రేజింగ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ కలకలం నిలిచిపోతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. మీ ఊహా శక్తి అతీతమైనది అంటూ హ్యాట్సాఫ్ మహా ‘రాజమౌళి’ అంటూ కామెంట్స్ చేశారు శంకర్‌. సినిమాలను భారీ స్థాయిలో తెరకెక్కించడం కాదు, సినిమాలను అదే స్థాయలో పొగడటం కూడా శంకర్‌కి తెలుసు.

సినిమాకి పని చేసిన వారందరినీ గొప్పగా పొగుడుతూ ఉంటారు. సమకాలీన కెరీర్‌లో ఓ అగ్ర దర్శకుడు మరో అగ్ర దర్శకుడిని పొగడటం అంటే చిన్న విషయం కాదు. సినిమాకు ఇప్పటివరకు వచ్చిన హైప్‌… శంకర్‌ ట్వీట్‌తో మరికొంత పెరుగుతుంది అని చెప్పొచ్చు. దర్శకుడు సుకుమార్‌ కూడా ఇదే స్థాయిలో రాజమౌళిని పొగిడేసిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus