సినీ పరిశ్రమలో మరో విషాదం.. మరో దర్శకుడు కన్నుమూత..!

సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతో మంది నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, ఫ్యాషన్ డిజైనర్లు, నటీనటుల బంధువులు, కుటుంబ సభ్యులు, ఫ్యాషన్ డిజైనర్లు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో పేరుగాంచిన సినీ ప్రముఖులు మరణిస్తుండడం గమనార్హం. తాజాగా మరో బాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూభాయ్‌ అంబానీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

బుధవారం నాడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. డాక్టర్లు అప్రమత్తమయ్యారు. వారు ఆయన ప్రాణం నిలబెట్టాలని చాలా ప్రయత్నించారు కానీ అది కుదర్లేదు. అర్థరాత్రి సమయంలో ఇస్మాయిల్‌ చివరి శ్వాస విడిచారు. ఇస్మాయిల్‌ మృతి బాలీవుడ్ రంగాన్ని కుదిపేసింది అని చెప్పాలి. ఆయనతో పనిచేసిన నటీనటులు టెక్నీషియన్లు ఇస్మాయిల్ మృతికి చింతిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా స్పందిస్తూ..‘‘ ఇస్మాయిల్‌ మరణం నన్ను చాలా బాధ పెడుతుంది.

ఆయన సినిమాతోనే నా కెరీర్ మొదలైంది. నాకు ఆయన కేవలం పని మాత్రమే ఇవ్వలేదు.నాకు జీవితాన్ని ఇచ్చారు. నా మీద చాలా నమ్మకం పెట్టారు కూడా .! నా పై నమ్మకం ఉంచిన మొదటి వ్యక్తి ఆయనే.! ఓ సామాన్యుడైన గోవింద్‌ స్టార్‌ హీరో గోవిందాగా ఎదిగాడు అంటే అందులో ఆయన పాత్ర చాలా ఉంది. దేవుడు ఆయన ఆ‍త్మకు శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను’’ అంటూ గోవిందా చెప్పుకొచ్చారు. అలాగే సీనియర్ నటి పద్మిని కొల్హాపురి స్పందిస్తూ..

‘‘ నేను ఆయనతో ‘తోడీసీ బేవఫాయ్‌, అహిస్ట అహిస్ట వంటి సినిమాలు చేశాను. ‘అహిస్ట అహిస్ట’ నా మనసుకు చాలా నచ్చిన మూవీ. ఆయన పని విషయంలో ఎంతో స్ట్రిక్ట్‌గా వ్యవహరించేవారు. ఆయన డెడికేషన్ ఈరోజు మమ్మల్ని ఇలా నిలబెట్టింది.ఎప్పుడూ ఆయన మొహంలో చిరునవ్వు కనిపించేది.ఆయన లేరు అనే మాట ఓ అందమైన అబద్ధం. అందరి చిరు నవ్వులోనూ, కష్టపడి ఎదగాలి అని పని చేసే ఫిలిం మేకర్స్ హార్ట్ వర్క్ లోనూ ఆయన బ్రతికే ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus