Hero Nani: ఆ డైరెక్టర్ నానిని దారుణంగా అవమానించాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న వాళ్లలో నాని ఒకరు. నాని నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా మినిమం గ్యారంటీ హీరోగా ఇండస్ట్రీలో నానికి పేరుంది. తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడిన నాని సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన కష్టాల గురించి, అవమానాల గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో మొదట్లో కష్టంగా అనిపించిందని ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తనకు అర్థమయ్యేది కాదని ఆయన అన్నారు.

ఈ ఇండస్ట్రీలో సాయం చేయడానికి కూడా ఎవరూ లేరని మనం నేర్చుకుంటున్న సమయంలో ఇబ్బందిగా ఉన్నా ఆ కష్టం తర్వాత వచ్చే సక్సెస్ స్పెషల్ గా ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నో సవాళ్లను, తిరస్కరణలను నేను ఎదుర్కొన్నానని ఆయన అన్నారు. క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఏదైనా చెప్పేయొచ్చని అనుకుంటారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా అన్నింటినీ అధిగమించాలని నాని తెలిపారు.

అలాంటి ఇబ్బందులు తనకు ఎదురయ్యాయని నాని చెప్పుకొచ్చారు. క్లాప్ బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అంటారని మాటలు పడినంత మాత్రాన నేను బాధ పడనని ఒక దర్శకుడు మాత్రం సెట్ లో అవమానించాడని నాని తెలిపారు. నేను ఎప్పటికీ డైరెక్టర్ కాలేనని ఆయన చెప్పడం నా హృదయాన్ని కలచివేసిందని నాని చెప్పుకొచ్చారు. అలాంటి ఎన్నో విమర్శలు ఎదురైన తర్వాత ఇక్కడికి వచ్చానని స్టార్ అయ్యాక ఆ దర్శకుడిని కలిశానని నాని తెలిపారు.

ఆ సమయంలో కూడా మా మధ్య చెప్పుకునే రేంజ్లో వాతావరణం అయితే లేదని నాని కామెంట్లు చేశారు. నాని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని కొంతమంది దగ్గర మాత్రమే పని చేయడంతో ఆ డైరెక్టర్ ఎవరో అర్థం కావడం నాని ఫ్యాన్స్ కు కష్టం కాదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus