Prabhas: డార్లింగ్‌ సినిమా పట్టాలెక్కకముందే షాక్‌ కొట్టిందా?

వైజయంతి మూవీస్‌ 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా చాలా రోజుల క్రితం ‘ప్రభాస్ – నాగ్‌ అశ్విన్‌’ కాంబోలో సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత వారం, పది రోజులకొకసారి సినిమా అప్‌డేట్స్ ప్రకటించింకుంటా వచ్చారు. అయితే సినిమా మాత్రం ఇంకా మొదలుకాలేదు. త్వరలో అంటున్నారు కానీ ఆ త్వరలో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ఈ లోగా సినిమా నుండి కొంతమంది దూరమైపోతున్నారని వార్తలొస్తున్నాయి. తాజాగా సింగీతం శ్రీనివాసరావు దూరమయ్యారని టాక్‌.

ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా కథ గురించి పెద్దగా బయట చెప్పకపోయినా ఇదో సోషియో ఫాంటసీ కథ అని మాత్రం తెలుస్తోంది. దీంతో ఆ రంగంలో బాగా అనుభవం ఉన్న ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును సినిమా గురించి తీసుకున్నారు. ఆయన అనుభవం సినిమాకు బాగా ఉపయోగపడుతుందని ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాను తప్పుకున్నారట. కథ, కథనం విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్‌ రావడం వల్ల ఆయన దూరమయ్యారని టాక్‌.

ఇక సినిమా ముచ్చట్లు చూసుకుంటే… ఈ సినిమా కోసం ప్రభాస్‌ 2022 మొత్తం కేటాయించడని గతంలో వార్తలొచ్చాయి. అయితే కరోనా వల్ల తన ప్రస్తుత సినిమాలు వాయిదా పడటంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అనేది తెలియడం లేదు. మరోవైపు ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌నే ప్లాన్‌ చేశారు. హీరోయిన్‌గా దీపిక పదుకొణె, కీలక పాత్రలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ను తీసుకున్నారు. ఇంకా చాలామంది ప్రముఖ నటులను కీలక పాత్రల కోసం తీసుకుంటారట.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus