Mohan Babu: ఆ ఇండస్ట్రీ హిట్ ను ఆ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తే ఎలా ఉండేదో..!

“పెదరాయుడు”.. ఈ సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1995లో రిలీజై ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా.. కలెక్షన్ల వర్షం కురిపించింది. తమిళ బ్లాక్ బస్టర్ ‘నాట్టామై’ సినిమాకి రీమేక్ వచ్చిన పెదరాయుడు మోహన్ బాబు‌కి లైఫ్ ఇచ్చింది. అప్పటి వరకు సరైన హిట్ లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ విలన్‌గా, చిన్న చితకా సినిమాలతో నెట్టుకొస్తున్న మోహన్‌బాబు కలెక్షన్ కింగ్‌గా టాలీవుడ్‌‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

మోహన్ బాబు నటన, సౌందర్య అందచందాలు, పాటలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన గెస్ట్ రోల్ పెదరాయుడికి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన పెదరాయుడిని తొలుత డైరెక్ట్ చేసే ఛాన్స్ బి.గోపాల్‌కి అందింది. కానీ ,అప్పటికే ఆయన విక్టరీ వెంకటేష్.. త్రివిక్రమరావు కాంబినేషన్‌లో ఓ సినిమాకి ఫిక్స్ కావడంతో .. పెదరాయుడు చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రవిరాజా పినిశెట్టికి అందింది.

ఆయన సినిమాని తనదైన స్టైల్లో తెరకెక్కించగా ఫ్యామిలీ ఆడియన్స్ పెదరాయుడుకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ప్రదర్శించబడినన్ని రోజులు థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి- కే. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ఘరానా మొగుడిదే కలెక్షన్ల పరంగా రికార్డు. దీనిని పెదరాయుడు తిరగరాసింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus