సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో డైరెక్టర్ కన్నుమూత!

ఈ ఏడాది దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,జయశీలన్ వంటి సినీ సెలబ్రిటీలు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదాల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ప్రముఖ దర్శకుడు గుండెపోటుతో మరణించడం హాట్ టాపిక్ అయ్యింది.

Director Shafi

వివరాల్లోకి వెళితే…. మలయాళ దర్శకుడు షఫీ గుండెపోటుతో మృతి చెందాడు. జనవరి 16న షఫీకి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో 10 రోజుల నుండి అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు. ఓ సమయంలో కోలుకున్నట్టు కనిపించినా.. తర్వాత మళ్ళీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఈయన వయసు 56 ఏళ్ళు మాత్రమే. షఫీ మరణవార్త మలయాళ సినీ పరిశ్రమని కుదిపేసింది అని చెప్పాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని అక్కడి సినీ ప్రముఖులు తమ సానుభూతి తెలియజేస్తున్నారు.

‘ఆడ్యతే కన్మణి’ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ను ప్రారంభించారు షఫీ. తర్వాత పృథ్విరాజ్‌ సుకుమారన్‌, బిజూమీనన్‌,మమ్ముట్టి, కుంచకో బోబన్‌, విక్రమ్‌ వంటి స్టార్ హీరోలతో పనిచేశారు. షఫీ తన కెరీర్లో ఎక్కువగా కామెడీ సినిమాలు తీశారు.అందులో పలు సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఆయన 50 కి పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు.

‘మనదే ఇదంతా’.. ‘ఇడియట్’ రోజులను గుర్తుచేసేలా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags