Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Star Director: శిష్యుల కోసం బ్యానర్ స్థాపించిన స్టార్ డైరెక్టర్!

Star Director: శిష్యుల కోసం బ్యానర్ స్థాపించిన స్టార్ డైరెక్టర్!

  • April 17, 2023 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Director: శిష్యుల కోసం  బ్యానర్ స్థాపించిన  స్టార్ డైరెక్టర్!

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన అసిస్టెంట్లను ఎంకరేజ్ చేస్తున్నారు. సొంతంగా బ్యానర్ స్థాపించి, తన శిష్యులకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న సుక్కూ శిష్యులు ఎవరో చూద్దాం. ‘ఆర్య’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన సుకుమార్.. ఫస్ట్ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. తన మార్క్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘పుష్ప: ది రైజ్ ‘ తో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

అయితే సుక్కూ మాదిరిగానే ఆయన శిష్యులు కూడా బ్లాక్ బస్టర్స్ కొడుతూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సుకుమార్ జీనియస్ డైరెక్టర్ గా ఒక స్థాయి అందుకున్నప్పటి నుంచి, తన అసిస్టెంట్లను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా వారికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో సుక్కూ శిష్యుల డామినేషన్ బాగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో డిఫరెంట్ సినిమాలు తీసి, ప్రేక్షకులను అలరిస్తున్నారు. గురువుకు తగ్గ శిష్యులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

‘ఉప్పెన’ సినిమాతో (Star Director) డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు సనా.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బుచ్చి సుకుమార్ కు ప్రియ శిష్యుడు. అనేక సినిమాలకు ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్ లో డైరక్టర్ గా లాంచ్ చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు బుచ్చిబాబు.

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీకాంత్ ఓదెల కూడా సుకుమార్ శిష్యుడే. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. ‘దసరా’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరడమే కాదు.. యుఎస్ లో 2 మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో ఒక్క దెబ్బతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పటికే బడా బ్యానర్లు అడ్వాన్సులు ఇవ్వడానికి యువ దర్శకుడి వెంట పడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

‘కరెంట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా ‘కుమారి 21F’ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. గతేడాది చివర్లో సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే సమకూర్చిన ’18 పేజెస్’ సినిమాను సూర్యప్రతాపే తెరకెక్కించాడు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. ‘పుష్ప’, ’18 పేజీస్’ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుక్కూకి సపోర్ట్ గా నిలిచిన శ్రీకాంత్.. ‘పుష్ప 2’ సినిమాలోనూ భాగం అవుతున్నాడు. అలానే డెవిల్, టైగర్ నాగేశ్వరరావు వంటి రెండు పాన్ ఇండియా సినిమాలకు రైటర్ గా పనిచేస్తున్నాడు.

‘దర్శకుడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జక్కా హరి ప్రసాద్.. ఎన్నో సినిమాలకి సుక్కుతో కలసి వర్క్ చేసాడు. ‘100% లవ్’ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. ‘1 నేనొక్కడినే’ సినిమాకు రచయితగా చేశాడు. ‘ప్లే బ్యాక్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యాంకర్ ప్రదీప్ హీరోగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే.

డైరక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సైతం ‘ఆర్య’ సినిమాకి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. సుక్కూ శిష్యుల్లో ఒకరైన వేమారెడ్డి త్వరలో ఓ బిగ్ ప్రాజెక్ట్ కోసం మెగాఫోన్ పట్టబోతున్నాడు. ‘భమ్ భోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. ఇప్పుడు సుకుమార్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘విరూపాక్ష’ అనే సినిమా తెరకెక్కించాడు.

ఇలా సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన చాలామంది ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన దర్శకులుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఓవైపు గురువు బ్లాక్ బస్టర్స్ కొడుతుంటే.. మరోవైపు ఆయన అసిస్టెంట్లు కూడా సత్తా చాటుతున్నారు. చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుంచి దర్శకులు వచ్చినట్లే.. రాబోయే కొన్నేళ్ళలో టాలీవుడ్ లో సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన శిష్యుల హవానే కొనసాగేలా కనిపిస్తోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bommarillu bhaskar
  • #Buchi Babu
  • #Director Srikanth Odela
  • #Jakka Hari Prasad
  • #Srikanth Vissa

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

6 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

22 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

20 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

21 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

22 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

23 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version