Chiranjeevi, Rajinikanth: చిరు – రజనీ మల్టీస్టారర్‌కి సిద్ధమా… దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమాలో మల్టీస్టారర్‌లు అంటే అంత ఈజీ కాదు. అయితే ఈ మాట ఇప్పటిది కాదు.. గతానిది. ఎందుకంటే ఇప్పుడు సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. అందులో ఒకటి మల్టీస్టారర్‌. పెద్ద హీరోలు, స్టార్‌ హీరోలు కలసి సినిమా చేయడానికి అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారు. అవి ఓకే అయిపోతున్నాయి కూడా. ఇప్పుడు మల్టీస్టారర్‌ గురించి ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే సౌత్‌ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ స్టార్‌ హీరోల మల్టీస్టారర్‌ గురించి డిస్కషన్‌ నడుస్తోంది కాబట్టి.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సినిమా చేయడానికి ప్రముఖ దర్శకుడు లారెన్స్‌ ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఆయన గతంలో ఓసారి దీని గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మరోసారి అదే మాట బయటకు వచ్చింది. లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ సినిమా ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన లారెన్స్‌ ఈ మల్టీస్టారర్‌ గురించి చెప్పుకొచ్చారు.

నిజానికి చిరంజీవి మల్టీస్టారర్‌ ప్రస్తావన గతంలోనే టాలీవుడ్‌లో వచ్చింది. అయితే అప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ఈ సినిమా ఉంటుంది అని అన్నారు. ప్రముఖ నిర్మాత సుబ్బరామి రెడ్డి ఈ సినిమా నిర్మిస్తా అంటూ అనౌన్స్‌మెంట్‌ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు లారెన్స్‌ ఈ మాట అంటున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణానికి చాలా మంది నిర్మాతలే ముందుకొస్తారు. మరి ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో చూడాలి.

చిరంజీవి (Chiranjeevi) – రజనీకాంత్ మల్టీస్టారర్ కోసం తన దగ్గర కథ కూడా సిద్ధంగా ఉందని లారెన్స్‌ చెప్పారు. దీంతో ‘త్వరగా త్వరగా’ అంటూ ఫ్యాన్స్‌ హడావుడి చేస్తున్నారు. లారెన్స్ గట్టిగా రంగంలోకి దిగితే ఇటు చిరంజీవి, అటు రజనీకాంత్‌ను ఒప్పించడం పెద్ద పని కాదు. చూద్దాం ఏమవుతుందో? అలాగే ఆ సినిమాకు విలన్‌ ఎవరు? మరో హీరో ఆ క్యారెక్టర్‌ చేస్తాడా అనే చర్చ కూడా మొదలైంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus