బాలీవుడ్ గురించి మాట్లాడినప్పుడు.. కరోనా – పాండమిక్‌కు ముందు, తర్వాత అని చెప్పొచ్చు. అప్పటివరకు దేదీప్యమానంగా వెలిగిపోయిన బాలీవుడ్.. ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లిపోయింది అని చెప్పొచ్చు. ఏ సినిమా వచ్చినా, ఎలాంటి సినిమా వచ్చినా బాలీవుడ్ జనాలు ఆదరించడం మానేశారు. గతంలో ఇలాంటి సినిమాలు విజయం సాధించాయి కదా.. ఇప్పుడేమైంది అస్సలు ఒప్పుకోవడం లేదు అని అనుకుంటున్నారు. అయితే ఇప్పటి పరిస్థితిని దాటాలంటే ఏం చేయాలో చెప్పుకొచ్చాడు ప్రముఖ హీరో రణ్‌బీర్ కపూర్.
బాలీవుడ్‌లో అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే హీరోల్లో (Star Hero) రణ్‌బీర్ కపూర్ ఒకడు అని చెప్పొచ్చు. పెద్ద స్టార్ అయి ఉండి కూడా.. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అంటుంటారు. అలాంటి రణ్‌బీర్ కపూర్.. తాజాగా హిందీ సినిమా ఇండస్ట్రీ మునుపటిలా ఎందుకు రాణించలేపోతోంది అనే విషయమై స్పందించాడు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే బాలీవుడ్ విజయాలు అందుకోలేకపోతోంది అని రణ్‌బీర్ కపూర్ అన్నాడు. కొత్త ప్రతిభకు ప్రోత్సాహమిస్తేనే మార్పు వస్తుందని సూచించాడు.
20 ఏళ్లుగా వెస్ట్రన్ కల్చర్‌ను అనుసరిస్తున్న, ఎక్కువగా రీమేక్స్ చేస్తున్న బాలీవుడ్ ప్రస్తుతం కన్‌ఫ్యూజన్‌లో ఉందని రణ్‌బీర్ కపూర్ అన్నాడు. దీంతో రణ్‌బీర్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. గతంలో అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బాలీవుడ్ మారాల్సిన సమయం వచ్చిందని… హీరోలు, కథలు, దర్శకుల, కథకులు ఇలా అందరూ ఈ దిశగా ఆలోచించాలి అన్నాడు. అంతేకాదు గతంలో ఓ సందర్భంలో రణ్‌బీర్ కూడా చెప్పుకొచ్చాడు.
కరోనా పాండమిక్ తర్వాత బాలీవుడ్‌లో మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఎక్కువ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడం లేదు. అవకాశాలు లేక చాలామంది నటులు ఇంట్లోనే ఉండిపోతున్నారు. దీంతో ఇండస్ట్రీలో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. మంచి కంటెంట్‌తో ఈ సమస్య నుండి బయటకొస్తాం అని చెప్పాడు. రణ్‌బీర్ త్వరలో ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా అది. రష్మిక మందన కథానాయిక.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?