పాలిటిక్స్ లో డిప్యూటీ సీయం అనే పదవి పెద్ద కీలకమైనదేమీ కాదు. నిజానికి అది అఫీషియల్ పోస్ట్ కూడా కాదు. కేవలం పార్టీలో కీలక సభ్యులను సంతుష్టులను చేయడం కోసం రాజకీయ నాయకులు సృష్టించిన పదవి అది. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పదవి యొక్క పరపతి పెరిగింది. ఇదివరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులుగా బోలెడు మంది సీనియర్ పొలిటీషియన్స్ బాధ్యతలు నిర్వహించినప్పటికీ..
ప్రజలకు వారి పేర్లు కూడా గుర్తులేవు. కానీ.. పవన్ కళ్యాణ్ వల్ల ఆ పోస్ట్ కి వేల్యు పెరిగింది. ఇప్పుడు తమిళనాట ఈ డిప్యూటీ సీయం పదివికి మంచి డిమాండ్ పెరిగింది. అక్కడ నిన్న డిప్యూటీ సీయంగా హీరో టర్న్డ్ పొలిటీషియన్ ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు మొత్తం ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఉదయనిధి స్టాలిన్ (Star Hero) స్వయాన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అన్న విషయం తెలిసిందే.అయితే.. ఆంధ్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడడం కోసం నడుం బిగించిన వ్యక్తి కాగా.. తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాత్రం హిందుత్వానికి వ్యతిరేకి. మరీ ముఖ్యంగా బీజేపీ అంటే అస్సలు గిట్టదు. పొరపాటున ఈ ఇద్దరు ఎదురుపడితే రాజకీయంగా రచ్చ జరగడం అనేది అనివార్యం.
ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు ఇద్దరూ సినిమా హీరోలు కావడంతో.. నెక్స్ట్ ఏ స్టేట్ లో సినిమా హీరో ఉపముఖ్యమంత్రి అవుతాడా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి కర్ణాటకలోను కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ ను కూడా ఉపముఖ్యంత్రిని చేస్తాడేమో అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.