మద్యం సేవించిన వారు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు అనేది అందరికీ తెలిసిన సంగతే. అతిగా మాట్లాడడం, హద్దులు మించి పక్క వారి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం వంటివి చేస్తుంటారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం మద్యం సేవించి వింత వింతగా ప్రవర్తిస్తున్నట్టు ఉండే వీడియోలను మనం అనేకం చూసాం. ఇప్పుడు కూడా కొంచెం అలాంటిదే జరిగింది. ఓ హీరోగారు తప్ప తాగి ఓ సింగర్ ను లైంగికంగా వేధించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే మన తెలుగు హీరో కాదు లెండి.ఈ ఘనకార్యం చేసింది హాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో. అతని పేరు ఎజ్రా మిల్లర్.హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళకి ఇతన్ని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. 2008లో ఇతను హీరోగా తన కెరీర్ ను మొదలుపెట్టాడు.మినిమమ్ గ్యారెంటీ హీరో అనే ముద్ర ఇతనికి ఉంది. ఏడాదికి కచ్చితంగా ఒక్క సినిమా అయినా విడుదల చేస్తుంటాడు ఇతను. అలాంటి హీరో కెరీర్ ఇప్పుడు రిస్క్ లో పడింది.
హవాయిలోని ఓ బార్‌లో జరిగిన పార్టీకి ఎజ్రా మిల్లర్ వెళ్ళాడు. ఆ పార్టీలో భాగాంగా ఇతను ఫుల్ గా మద్యం సేవించాడు. తర్వాత విచక్షణ కోల్పోయి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించాడు.ఈ క్రమంలో స్టేజ్ పై పాటలు పాడుతున్న ఓ సింగర్ వద్దకు వెళ్లి ఆమె పై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.అలా చాలా సేపు ఆమెను లైంగికంగా వేధించాడు. మధ్యలో అతన్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన ఆ బార్ మేనేజర్ మరియు సిబ్బంది పై అతను చెయ్యి చేసుకున్నాడు.
ఆ సింగర్ కు ఏం చేయాలో తెలీక కంగారు పడుతున్న టైములో ఎజ్రా ఆమె చేతుల్లో ఉన్న మైక్రోఫోన్ ను తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోయాడు. దీంతో బార్ ఓనర్ మరియు మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు ఎజ్రాను అదుపులోకి తీసుకొని 500 డాలర్లు ఫైన్ వేశారు.అలాగే ఇతనికి బెయిల్ కూడా మంజూరు అయ్యింది. ఏదేమైనా ఈ హీరో కెరీర్ కు ఇదో పెద్ద మచ్చనే చెప్పాలి.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?