Balakrishna: అభిమాని కోసం ఆ పని చేసిన బాలయ్య..?

స్టార్ హీరోలలో చాలామంది హీరోలు అభిమానుల వల్లే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. నందమూరి హీరో బాలకృష్ణ కొన్ని సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకున్నా అభిమానులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం తన వంతు సహాయం చేయడానికి అస్సలు వెనుకాడరు. తాజాగా బాలయ్య ఒక అభిమానితో ఫోన్ కాల్ మాట్లాడగా ఆ ఫోన్ కాల్ నెట్టింట వైరల్ అవుతోంది. అభిమాని ఆరోగ్యం బాలేదని తెలియడంతో బాలకృష్ణ అభిమానికి కాల్ చేశారు.

చిత్తూరు జిల్లాలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన మురుగేష్ చెట్టు మీద నుంచి కింద పడటంతో నడుముకు గాయం కాగా మంచానికే పరిమితమయ్యారు. ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానితో మాట్లాడుతూ ఆదిత్య 369 మూవీ షూటింగ్ టైమ్ లో తన నడుము కూడా విరిగిందని అన్నారు. ఆ సమయంలో తాను ధైర్యంగా ఉండటంతో కోలుకున్నానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. బాధితుడి ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకోవడంతో పాటు బాధితుడికి బాలయ్య 40వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.

బాలయ్య చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య అఖండ మూవీలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెలలో అఖండ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus