పెళ్లి ఇద్దరు మనుషుల్ని కాదు.. రెండు కుటుంబాలను కలుపుతుంది అని అంటారు. అలాంటప్పుడు విడాకులు కూడా రెండు కుటుంబాలను విడదీస్తాయి. అయితే ఇక్కడ రెండు కాదు, మూడు కుటుంబాలను అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లి చేసుకొని, విడిపోయే లోపు ఆ ఇద్దరికి మరో కుటుంబం ఏర్పడి ఉంటుంది కాబట్టి. అలాంటి మూడో కుటుంబం ఈ క్రమంలో పడే ఇబ్బందుల్ని ఓ స్టార్ హీరోయిన్ తనయ వివరించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan), రీనా దత్తా 22 ఏళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే.
Ira Khan
వారి విడాకుల గురించి ఆ జంట కుమార్తె ఐరా ఖాన్ (Ira Khan) ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. విడాకుల అనంతరం వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. అంతే కాదు మానసిక ప్రశాంతతన కూడా కోల్పోయానని నాటి పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేశారామె. తన చిన్నతనంలో ఇంట్లో ఎప్పుడూ సందడి వాతావరణం ఉండేదని, తల్లిదండ్రులు కూడా పెద్దగా గొడవలు పడిన సందర్భాలు లేవని చెప్పారామె. మ ఎదురుగా ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాళ్లు.
దీంతో వాళ్లు విడాకులు తీసుకుంటున్నప్పుడు తమపై ఎలాంటి ప్రభావ ఉండదు అనే అనుకున్నాను. కానీ విడాకులు జరిగాక మానసికంగా కుంగుబాటుకు గురయ్యా అని చెప్పింది ఐరా ఖాన్. దీంతో ఈ విషయంలో థెరపిస్ట్ సలహాలు, సూచనలు తీసుకున్నాను. వాళ్లు ఇచ్చిన ధైర్యంతో ఈ విషయంలో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నాను. ఇక్కడో విషయం ఏంటంటే.
అమ్మ, నాన్న విడిపోయినప్పటికీ నన్ను, జునైద్ ఖాన్‌ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని ఐరా చెప్పుకొచ్చింది. ఆమిర్ ఖాన్ – రీనా దత్తా 1986లో వివాహం చేసుకున్నారు. 2002లో విడాకులు తీసుకున్నారు. ఇక ఐరా ఖాన్ (Ira Khan) ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్‌ను పెళ్లి చేసుకున్నారు. మరోవైపు ఆమిర్ తన రెండో భార్య కిరణ్ రావ్‌కు కూడా ఇటీవల విడాకులు ఇచ్చారు.