‘ఇక్బాల్’, ‘ఓం శాంతి ఓం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాస్ తల్పాడే.. ఆ తరువాత ‘గోల్ మాల్’ సిరీస్ మరింత క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఈ నటుడు అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెబుతుండడం విశేషం. బన్నీ కొత్త సినిమా ‘పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఈ సినిమాతో హిందీ మార్కెట్ లో అడుగుపెడుతున్నారు బన్నీ. హిందీలో తెలుగు డబ్బింగ్ సినిమాలను యూట్యూబ్ లో
రిలీజ్ చేసి బాగా పాపులారిటీ సంపాదించినా గోల్డ్ మైన్ ఫిలిమ్స్ ‘పుష్ప’ హిందీ హక్కులను సొంతం చేసుకోగా.. ఏఏ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ‘పుష్ప’ సినిమా హిందీ డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే శ్రేయాస్ ను రంగంలోకి దించారు. ఈ విషయాన్ని శ్రేయాస్ నేరుగా మీడియా ముందు చెప్పారు. ‘పుష్ప’ హిందీ ట్రైలర్‌ను లాంచ్ చేస్తోన్న సమయంలో శ్రేయాస్ ఈ విషయాన్ని చెప్పాడు.
అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోకి వాయిస్ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పాడు. మరి ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి!
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!