ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరో…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్లో ‘తానాజీ’ వంటి సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు.ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.అయితే కీలకమైన సీత పాత్రలో ఏ హీరోయిన్ కనిపించనుంది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నిర్మాతలు. అయితే శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చారు అజయ్ దేవగణ్ టీమ్.

‘ఆదిపురుష్’ వంటి భారీ బడ్జెట్ చిత్రం కోసం అజయ్ దేవగన్ ను ఎవ్వరూ సంప్రదించలేదు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు. నిజంగానే అలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటిస్తే ముందుగానే మేము అధికారికంగా ప్రకటిస్తాం కదా’…అంటూ వారు తెలియజేశారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ కు సంబంధించి అజయ్ దేవగన్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. అతి త్వరలో ఆ బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్లో ఆయన జాయినవుతారని తెలుస్తుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus