ఈ మధ్యకాలంలో ఎంతో మంది గుండెపోటుతో మరణించడం మనం రోజు చూస్తున్నాం..ఇటీవల కాలంలో సినిమా ఇండ్రీస్టీలో ఎంతో మంది స్టార్ హీరోలు, నటులు గుండెపోటుతో మరణించారు. గుండెపోటు వచ్చినప్పుడు ప్రధానంగా సిపిఆర్ చేయాలని డాక్టర్లు తరుచూ చెబుతుంటారు..వాటిని మనం లైట్ గా తీసుకుంటాం..కానీ సిపిఆర్ అనేది ఓ నిండు ప్రాణం నిలబెడుతోందని మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఓ సిరియల్ హీరో ఓ వ్యక్తి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు.
టీవీ ప్రపంచంలోని వెటరన్ స్టార్లలో ఒకరైన గుర్మీత్ చౌదరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రోడ్డుపక్కన నేలపై పడిపోయిన వ్యక్తికి ఆయన సీపీఆర్ చేయడం కనిపిస్తోంది. ఈ సమయంలో ఆయన ఇతర వ్యక్తులకు సహాయం చేయడానికి రమ్మనడం కూడా కనిపిస్తోంది. ఆయన సహకారాన్ని చూసిన అందరూ నువ్వు రీల్ రాముడివే కాదు రియల్ లైఫ్ లో కూడా ఆ రాముడే ఆయన కోసం నిన్ను పంచారని కొనియాడుతున్నారు.
అంధేరీ వీధుల్లో పడిపోయిన వ్యక్తికి గుర్మీత్ చౌదరి సీపీఆర్ ఇచ్చినట్లు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను చూడటం ద్వారా మనకు కూడా సీపీఆర్ చేయడం ఎంత అవసరమో అర్థం అవుతుంది. మనలో చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. గుర్మీత్ ఈ వ్యక్తికి సీపీఆర్ ఇస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆ సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున్న జనాలు అక్కడకు గుమికూడారు. సీపీఆర్ అనంతరం రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని కొందరు పైకి లేపారు.
గుర్మీత్ చౌదరి (Gurmeet Choudhary) వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా ఆయనపై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన పై పలు కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రతి నటుడు మొదట మనిషిగా ఉండాలి .. తరువాత నటుడు కావాలి’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. గుర్మీత్ చౌదరి రామాయణంలో శ్రీరామునిగా నటించి ప్రసిద్ధి చెందాడు.
దీని తర్వాత అతను గీత్ హుయ్ సబ్సే పరాయిలో మాన్ సింగ్ ఖురానా పాత్రను పోషించాడు. కృతికా సెంగార్‌తో కలిసి పున్నర్ వివాహ్‌లో కూడా నటించాడు. అతను ఝలక్ దిఖ్లా జా 5, నాచ్ బలియే 6 , ఖత్రోన్ కే ఖిలాడి 5 వంటి రియాలిటీ షోలలో కూడా భాగం అయ్యాడు.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!