మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన పేరుకి మలయాళ స్టార్ అయిన కూడా తెలుగులో ఆయన సినిమాలు చాలానే డబ్ అయ్యాయి మంచి విజయం అందుకున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. ఇకపోతే ఏ హీరోకి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును ఆయన తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
అసలు విషయంలోకి వెళితే.. ఇండస్ట్రీల్లోనూ చాలా మంది హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అయిపోయింది. కానీ, ఒకప్పుడు మన సీనియర్ హీరోలు ఏడాదికి పది ఇరవై చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించేవారు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఒకే ఏడాదిలో 19సినిమాలు తీసిన చరిత్ర ఉంది. ఆయనేకాదు మన సౌత్ పిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కేవలం ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.
ఆయనే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి సినీ రంగంలో కొనసాగుతున్నారు మోహన్ లాక్.. ఆయన ఇప్పటి వరకు దాదాపు 340 చిత్రాల్లో నటించారు. నాలుగు సార్లు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తున్న మోహన్ లాల్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఏ హీరోకు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు.
1986లో మోహన్ లాల్ (Star Hero) నటించిన 34 సినిమాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో 25 సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో మోహన్ లాక్ ఒకే ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటించడమే గాక.. అత్యధిక హిట్ చిత్రాల కథానాయకుడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ హీరో బ్రేక్ చేయలేదు.