సెన్సార్ పూర్తి చేసుకున్న నిఖిల్ 18 పేజస్!

సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 18 పేజీస్. ఈ చిత్రాన్ని జీఏ 2’ పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి నేడు ట్రైలర్ విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో ఫ్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా జరపడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 19వ తేదీసాయంత్రం 6 గంటలకు జేఆర్సి కన్వెన్షన్ లో ఎంతో ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు.ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు

ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఎలాంటి ఎడిట్స్ లేకుండా పూర్తిగా ఈ చిత్రానికి యు/ ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ2 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా విజయంతో 18 పేజీస్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus