బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పృథ్వీరాజ్’.జూన్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఢిల్లీ పాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథతో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రమిది. రిలీజ్ రోజున ఈ చిత్రం పాజిటివ్ టాక్ నే రాబట్టుకుంది. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ వారం రోజులు కూడా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ నిలబడలేదు. నిన్న నార్త్ లో కొన్ని థియేటర్లో ఈ చిత్రం షోలను రద్దు చేశారు.
అందుకు ప్రధాన కారణం థియేటర్లలో జనం లేకపోవడమే అని తెలుస్తుంది. ఒకరిద్దరి కోసం డెఫిసిట్లతో షో వేయడం కంటే నిలిపివేయడం బెటర్ అని థియేటర్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యశ్ రాజ్ ఫిలిం’ సంస్థ నిర్మించింది. భారీ వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ తో రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించింది.
ఆమెకు ఈ చిత్రం కోసం రూ.కోటి రూపాయల పారితోషికాన్ని చెల్లించారు. కరోనా కారణంగా చాలా సార్లు విడుదల వాయిదా వేసుకున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎట్టకేలకు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. మొదటి వారం ఈ చిత్రం రూ.55 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే నమోదు చేసింది. అక్షయ్ కుమార్ నటించిన సినిమాల్లో ఇంత ఘోరమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన మూవీ ఇదే అని చెప్పాలి. ఈ చిత్రానికి ఓటీటీ ఆఫర్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి. డైరెక్ట్ గా ఓటీటీకి ఇచ్చుకున్నా.. నిర్మాత సేఫ్ అయ్యి ఉండేవాడేమో..!
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!