Star Hero: సంచలన నిర్ణయం తీసుకున్న హీరో.. నిజంగా చేస్తాడా?

టాలీవుడ్ హీరోలు పెళ్లి గురించి తొందరపడరు. కెరీర్ ను పక్కా ప్లాన్ చేసుకుని.. తర్వాత కూడా ఓకే బాగానే ఉంటుంది అనుకుంటే తప్ప.. పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వరు. టాలీవుడ్లో ముదురు బెండకాయలు చాలా మందే ఉన్నారు. ఎవ్వరూ కూడా పెళ్లి విషయమెత్తితే వెంటనే మాట దాటేస్తున్నారు. ప్రభాస్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఏమో కానీ చాలా మంది హీరోలు పెళ్లంటే భయపడిపోతున్నారు. అయితే ఓ హీరో మాత్రం పెళ్లి గురించి ఓపెన్ గా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చి షాకిచ్చాడు.

అందులో షాకేముంది అని మీరు అనుకోవచ్చు. ఒకసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయితే.. చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి అని భావిస్తారు హీరోలు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ రాజస్థాన్ వంటి రాష్ట్రాలకి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని వస్తున్న వారిని ఎంతో మందిని చూశాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరో అయితే కేవలం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడట. అతను మరెవరో కాదు (Star Hero) సంతోష్ శోభన్.

దివంగత స్టార్ రైటర్ కమ్ దర్శకుడు అయిన.. శోభన్ గారి అబ్బాయి ఇతను. ‘పేపర్ బాయ్’ ‘ఏక్ మినీ కథ’ వంటి మంచి సినిమాలు చేశాడు. అయితే ఇతను నటించే సినిమాల్లో పెళ్ళికి సంబంధించిన అంశం ఉంటుంది. ఇతను నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రేమ్ కుమార్’ కూడా అంతే..!

దీంతో ‘పెళ్ళికి తొందరగా.. ఉందా? మీ పెళ్లి ఎప్పుడు?’ అని అతన్ని ప్రశ్నించగా..” నన్ను నెక్ట్స్‌ సినిమా ఎప్పుడు అని ఇంట్లో వాళ్లు అడుగుతున్నారు కానీ పెళ్లి గురించి అడగడం లేదు. ఇప్ప‌టికైతే ఆ ఆలోచ‌న అస్స‌లు లేదు. పెళ్లి బ‌ట్ట‌లు చూస్తుంటే డిప్రెష‌న్ వ‌చ్చేస్తుంది .. పెళ్లి త‌తంగం వ‌ద్ద‌నిపిస్తుంది.కానీ కచ్చితంగా పెళ్లంటూ చేసుకుంటే రిజిష్ట‌ర్ మ్యారేజ్ చేసుకుంటాను” అంటూ కామెంట్ చేశాడు ఇతను.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus