Ram: లవర్ బాయ్ లుక్ లో ఫిదా చేస్తున్న రామ్.. లుక్ అదుర్స్ అంటూ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram Pothineni) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ తో (Double Ismart) బిజీగా ఉన్న రామ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రామ్ తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు రాగా స్లిమ్ లుక్ లో ఉన్న రామ్ ను చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. కొత్త లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రామ్ పోతినేని న్యూ లుక్ మామూలుగా లేదని రామ్ వయస్సు పెరుగుతుందో తగ్గుతుందో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బీ.హె.ఈ.ఎల్ లోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు రామ్ హాజరు కాగా రామ్ ను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. డబుల్ ఇస్మార్ట్ అంటూ అభిమానులు కేకలు వేశారు. లవర్ బాయ్ లుక్ లో రామ్ భలే ఉన్నాడంటూ రామ్ లేడీ ఫ్యాన్స్ చెబుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ అప్ డేట్స్ కూడా ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

డబుల్ ఇస్మార్ట్ లో రామ్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని భోగట్టా. మణిశర్మ (Mani Sharma) ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఇప్పటికే షూట్ చేసిన ఫుటేజ్ కు ఆయన రీరికార్డింగ్ పనులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ రోల్ లో సంజయ్ దత్ నటిస్తున్నారు.

త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. పూరీ జగన్నాథ్ కచ్చితంగా హిట్ సాధించాలనే ఆలోచనతో ఈ సినిమా విషయంలో ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బస్టర్ అవుతుందని రామ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) మూవీ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus