అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న హీరో..!

ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి చేసుకుంటున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. ఆల్రెడీ కత్రీనా కైఫ్‌-విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌, నయన్- విగ్నేష్ వంటి వారు పెళ్లిళ్లు చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో కమ్ విలన్ కూడా ఈ లిస్ట్ లో చేరుతున్నట్లు తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే… విద్యుత్‌ జమ్వాల్‌ పేరు అందరూ వినే ఉంటారు. బాలీవుడ్‌లో విలన్ గా హీరోగా కూడా సినిమాల్లో నటిస్తున్నాడు.

తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతను సుపరిచితమే.ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘శక్తి’ ‘ఊసరవెల్లి’ వంటి చిత్రాల్లో ఇతను నటించాడు.సూర్య హీరోగా నటించిన ‘సికందర్'(తమిళ్ లో అంజాన్) మూవీలో స్నేహితుడి పాత్ర కూడా పోషించాడు. నిజానికి ‘శక్తి’ చిత్రంతోనే ఇతను సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు అనే విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. తెలుగు సినిమాలతో నటన మొదలుపెట్టాకే హిందీ సినిమల్లో నటించడం మొదలు పెట్టాడు.

త్వరలో ఇతను పెళ్లి పీటలెక్కబోతున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. తన ప్రియురాలు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నందితా మహ్తానీతో ఈ నెలలోనే ఏడడుగులు వేయబోతున్నారు అని తెలుస్తుంది.ఆల్రెడీ ఈ జంట గత ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకుంది.ప్రస్తుతం లండన్‌ వేకేషన్‌లో ఉన్నారు. అక్కడే సీక్రెట్‌గా ఈ కపుల్‌ పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు మొదలయ్యాయి. కానీ ఇందులో నిజం లేదు అని విద్యుత్ స్నేహితులు కూడా చెప్పుకొస్తున్నారు. మరికొన్ని రోజుల్లో తమ వివాహం పై స్వయంగా విద్యుత్ క్లారిటీ ఇస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం అతను ‘ఐబి 71’ ‘షేర్ సింగ్ రానా’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus