హాస్పిటల్ లో చేరిన స్టార్ హీరో.. కుడికాలి వేళ్ళను తొలగించారట..!

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మరియు డి.ఎం.డి.కె అధ్యక్షుడు అయిన విజయ్ కాంత్..కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఈయన ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్టు వార్తలు వచ్చినా… విజయ్ కాంత్ మాత్రం చాలా బలహీనంగా తయారయ్యారు.దాంతో మళ్ళీ ఆయన ఆరోగ్యం దెబ్బ తినడంతో సింగపూర్, అమెరికా వంటి దేశాలకు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ ట్రీట్మెంట్ వర్కౌట్ అయ్యిందని వారు సంతోషించేలోపే మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది.

ఆయన ఆరోగ్యం బాలేని కారణంగా ఆయన్ని మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక పార్టీ బాధ్యతలు విజయ్ కాంత్ భార్య ప్రేమలత స్వీకరించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. విజయ్ కాంత్ తాజా హెల్త్ బుల్లెట్ బయటకు వచ్చింది. ఆయన కుడి కాలికి ఉన్న 3 వేళ్ళను వైద్యులు తొలగించారు. ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా కాలివేళ్లకు రక్తం సరఫరా అవ్వడం లేని కారణంగా వైద్యులు అత్యవసర పరిస్థితిలో ఆయన కాలి వేళ్లను తొలగించినట్టు తెలుస్తుంది.

అయితే ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారట. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెప్పుకొచ్చారు. అలాగే పార్టీ పెద్దలు కూడా ఎటువంటి ఫేక్ న్యూస్ లను నమ్మొద్దు అంటూ కార్యకర్తలను, అభిమానులను కోరుతున్నారు. విజయ్ కాంత్ కి కాలి వేళ్ళను తొలగించిన విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

అలాగే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా… ‘నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకోవాలని మునుపటిలా కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus