2020 డిసెంబర్ నాటికి కరోనా ఉధృతి తగ్గింది కదా అని అందరూ సంతోషించారు. ఆ నెల చివర్లో థియేటర్లు కూడా ఓపెన్ అవ్వడం తో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్ ను సైతం లెక్క చేయకుండా థియేటర్లకు జనాలు వస్తుండటం చూసి వారిలో కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యంగా హీరోలు కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అదే ఊపులో రెండేసి సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్ళారు. కానీ కట్ చేస్తే అలాంటి వాళ్ళకే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా చోట్ల లాక్ డౌన్ ఏర్పడడంతో ఆ హీరోల చిత్రాల నిర్మాతలు వడ్డీల రూపంలో లక్షలకు లక్షలు బ్యాంక్ లకు కడుతున్నారు. ఇది హీరోల పై కూడా ఒత్తిడి పెంచే విషయమే..! ఎందుకంటే లాక్ డౌన్ ముగిసాక వరుసగా అదీ గ్యాప్ లేకుండా షూటింగ్ లలో పాల్గొనాల్సి వస్తుంది.ప్రమోషన్ల కార్యక్రమాల్లో కూడా అదే విధంగా పాల్గొనాలి. సరే ఇంతకీ రెండేసి సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లి ఇబ్బంది పడుతున్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) ప్రభాస్ :
ఓ పక్క ‘రాధే శ్యామ్’ మరో పక్క ‘ఆది పురుష్’, ‘సలార్’ వంటి చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఏ సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియని పరిస్థితి.
2) పవన్ కళ్యాణ్ :
క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో పాటు రానాతో కలిసి చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ను కూడా పవన్ ఫినిష్ చేయాల్సి ఉంది. అంతేకాకుండా హరీష్ శంకర్ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయాలి.
3) నాగ చైతన్య :
‘లవ్ స్టోరీ’ విడుదలకు రెడీగా ఉంది మరోపక్క ‘థాంక్యూ’ ‘లాల్ సింగ్ చడ్డా'(హిందీ) వంటి సినిమాల్లో నటించాల్సి ఉంది. ఇవి ఎప్పుడు ఫినిష్ అవుతాయో.. ఎప్పుడు రిలీజ్ అవుతాయో..!
4) రాంచరణ్ :
ఓ పక్క ‘ఆర్.ఆర్.ఆర్’ ఫినిష్ చెయ్యాలి అలాగే ‘ఆచార్య’ లో తన పార్ట్ పూర్తి చెయ్యాలి. త్వరలో శంకర్ డైరెక్షన్లో కూడా ఓ మూవీ మొదలుపెట్టాలి.
5) వెంకటేష్ :
ఓ పక్క ‘నారప్ప’ ఫినిష్ చెయ్యాలి మరో పక్క ‘ఎఫ్3’ లో కూడా నటించాలి. అలాగే ‘దృశ్యం’ విడుదలకు సిద్ధమైతే దాని ప్రమోషన్స్ లో కూడా పాల్గొనాలి.
6) నాని :
విడుదలకు సిద్దమైన ‘టక్ జగదీష్’ ప్రమోషన్స్ ఒక పక్క, అలాగే ‘శ్యామ్ సింగ రాయ’ ‘అంటే సుందరానికి’ షూటింగ్లు మరో పక్క..! నానికి ఇది పెద్ద టాస్కే..!
7) వరుణ్ తేజ్ :
ఓ పక్క ‘ఎఫ్3’ ఫినిష్ చెయ్యాలి మరోపక్క ‘గని’ షూటింగ్ లో పాల్గొనాలి.
8) రవితేజ :
‘ఖిలాడి’ తో పాటు శరత్ మండవ డైరెక్షన్లో కూడా ఓ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు రవితేజ. వాటితో పాటు త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో కూడా ఓ మూవీ చేయాల్సి ఉంది.
9) నాగ శౌర్య :
‘వరుడు కావలెను’ ‘లక్ష్య’ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ‘పోలీస్ వారి హెచ్చరిక’ వంటి 4 ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలి ఈ యంగ్ హీరో.
10)సుధీర్ బాబు :
‘శ్రీదేవి సోడా సెంటర్’ తో పాటు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రాజెక్టుని కూడా సుధీర్ బాబు కంప్లీట్ చేయాల్సి ఉంది.