ప్రస్తుత కాలంలో ఒక సినిమా నిర్మించటానికి భారీ మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది. సినిమా మేకింగ్ ఖర్చులతో పాటు హీరోల భారీ రెమ్యునరేషన్ వల్ల సినిమా మేకింగ్ నిర్మాతలకు భారంగా మారింది . సినిమా హిట్ అయితే నిర్మాతలు లాభాలు చూస్తారు . కానీ సినిమా ప్లాప్ అయితే మాత్రం నిర్మాతలు భారీ నష్టాలలో కూరుకుపోతున్నారు. దీంతో సినిమా నిర్మాణ వ్యయం తగ్గించడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా షూటింగ్లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బడా హీరోలందరూ దిగివచ్చి తమ రెమ్యూనరేషన్ తగ్గించుకొనుటకు అంగీకరించినట్టు సమాచారం. ఒకటవ తేదీ నుండి సినిమా షూటింగ్లో నిలిపివేయడంతో భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న బడా హీరోల సినిమాలకు కూడ బ్రేక్ పడనుంది. ఇప్పటికి బడా హీరోల సినిమాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. అందువల్ల సినిమా బడ్జెట్ కంట్రోల్ చేయటానికి కొందరు స్టార్ హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి అంగీకరించారు.
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ దిల్ రాజుతో సంప్రదింపులు జరిపి తమ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఇటీవల జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో ఓటీపీలో సినిమాల విడుదల విషయం గురించి కొన్ని కీలక నిర్ణయాలు జరిగాయి. భారీ బడ్జెట్లో నిర్మించిన సినిమాలు థియేటర్లలో విడుదలైన 10 వారాల తర్వాత మాత్రమే ఓటీపీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సినిమా టికెట్ ధరలు కూడా సామాన్యులకి అందుబాటులో ఉండేలా ఉండాలని నిర్ణయించారు.
ఇక ఈ క్రమంలో సినీ కార్మికుల వేతనాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి అంగీకరించినప్పటికీ ఇతర హీరోల విషయం మాత్రం తెలియటం లేదు. స్టార్ హీరోలు దిగివచ్చి తగ్గించుకున్నా కూడా ఆగస్టు ఒకటో తేదీ నుండి కొన్ని రోజులపాటు సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించుకుంది.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!