తెలుగు సినిమా రూట్ మారుతోంది..!

తెలుగు సినిమా రూట్ ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. ఎలాంటి సినిమాకైనా సరే హిట్ టాక్ వస్తే చాలు.. డబ్బింగ్ రైట్స్ కి, రీమేక్ రైట్స్ కి ఎగబడిపోతున్నారు. ముఖ్యంగా అదర్ లాంగ్వేజస్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. బాహుబలికి ముందు తెలుగు సినిమా, బాహుబలికి తర్వాత తెలుగు సినిమా అనే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరీజగన్నాథ్ చేస్తున్న లైగర్ సినిమాకి భారీగా ఆఫర్లు వస్తున్నాయని టాక్. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాని హిందీలో కరణ్ జోహార్ సంస్థ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాదు, మిగతా భాషల్లో కూడా ఒకేసారి ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకి డబ్బింగ్ రైట్స్ అలాగే, రీమేక్ రైట్స్ కోసం ముందుగానే కొన్ని సంస్థలు పోటీ పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. దీనికోసం భారీగా ఆఫర్ చేస్తున్నారట. ఏ భాషలో అయితే సినిమా రిలీజ్ అవ్వట్లేదు అక్కడ ఈ సినిమాని రీమేక్ చేయాలని చూస్తున్నారు. అందుకే చాలామంది ఇప్పటికే ఈ సినిమాపై కన్నేసినట్లుగా సమాచారం. ఈ సినిమాకే కాకుండా అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాకి కూడా ఇప్పుడు భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ ఈ సినిమాని ఐదుభాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ, ఇప్పుడు సర్వత్రా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మరో ఐదుభాషల్లో కూడా సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అందుకోసం ఇప్పట్నుంచే ప్రయత్నాలు చేస్తోందట మూవీ టీమ్. ఇక ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాధేశ్యామ్ సినిమా కూడా ఏడుభాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఈసినిమా కోసం వేరే భాషల్లో ప్రత్యేకమైన డబ్బింగ్ కార్యక్రమాలని కూడా చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేసింది. అంతేకాదు, మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమాలకి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కేవలం పోస్టర్స్ కి , అప్డేట్స్ కి ఈ రకమైన రెస్పాన్స్ వస్తుంటే, సినిమా టీజర్ లేదా ట్రైలర్ రిలీజైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలంటున్నారు అందరూ. ఈ మూడు సినిమాలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ రూట్ ని కంప్లీట్ గా మార్చేస్తున్నాయని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. అదీ మేటర్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus