Baby Movie: ‘హృదయ కాలేయం’ వల్ల సాయి రాజేష్ ను చీప్ డైరెక్టర్ అనుకున్నాడట..!

ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన ‘బేబీ’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అతి త్వరలో ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.యూత్ అంతా ఈ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు అనే చెప్పాలి. ‘కలర్ ఫోటో’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సాయి రాజేష్ ‘బేబీ’ ని డైరెక్ట్ చేయడం జరిగింది. ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటించిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా.. ‘బేబీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేయడం జరిగిందట. ఈ విషయాన్ని దర్శకుడు సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. అసలు మేటర్ ఏంటంటే.. సాయి రాజేష్ మొదట స్టీవెన్ శంకర్ పేరుతో ‘హృదయ కాలేయం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన స్పూఫ్ కామెడీ మూవీ అది.

ఆ చిత్రాన్ని అతనే నిర్మించడం జరిగింది. అది సూపర్ హిట్ అయ్యింది. మంచి లాభాలను మిగిల్చింది. అయితే ఆ సినిమా వల్ల సాయి రాజేష్ ను చీప్ దర్శకుడు అని భావించి ‘బేబీ’ కథని వినడానికి నిరాకరించాడట ఓ మిడ్ రేంజ్ హీరో. ఆ తర్వాత ఇంకో హీరోని అప్రోచ్ అవ్వగా అతను కూడా అలాగే రియాక్ట్ అయ్యి నెగిటివ్ కామెంట్లు చేశాడట.

అవన్నీ సాయి రాజేష్ కు బలంగా గుర్తుండిపోయాయట. అందుకే (Baby Movie) ‘బేబీ’ కథని ఎంతో కసితో డిజైన్ చేయించుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే స్క్రిప్ట్ లేకుండానే ఈ సినిమాని సాయి రాజేష్ తెరకెక్కించడం జరిగిందట.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus