దర్శకుడి ఆత్మకథలో బయటపడిన హీరోయిన్‌ గొప్పతనం

పాటలో చిందేయడానికి, తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేయడానికి కూడా కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తున్న హీరోయిన్లు ఉన్న కాలం ఇది. అందుకే గెస్ట్‌ అప్పీరియెన్స్‌లు ఏమంత చౌక కాదు అని అంటుంటారు. టాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్‌… ఇలా ఏ వుడ్‌ అయినా ఇదే లెక్క. అయితే ఇలాంటి రోజుల్లో ఓ నాయిక కేవలం 11 రూపాయల పారితోషికంతో ఓ సినిమాలో నటించింది అంటే నమ్ముతారా? కానీ జరిగింది. ఆ పని చేసింది ఎవరో కాదు సోనమ్‌ కపూర్‌.

మిల్కా సింగ్‌ జీవితం ఆధారంగా రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా కొన్నేళ్ల క్రితం ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ అనే సినిమా చేశారు గుర్తుందిగా. ఫరాన్‌ అక్తర్‌ అందులో మిల్కా సింగ్‌గా కనిపించి మెప్పించాడు. అందులో బిరో అనే పాత్రలో సోనమ్‌ కపూర్‌ నటించింది. ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ కాకపోయినా కీలకమైన పాత్ర అది. ఆ పాత్ర కోసం సోనమ్‌ కపూర్‌ కేవలం 11 రూపాయలే తీసుకుందట. ఈ విషయాన్ని రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా తెలిపారు.

రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా ‘ది స్ట్రేంజర్‌ ఇన్‌ ది మిర్రర్‌’ పేరుతో ఆత్మ కథ సిద్ధం చేశారు. అందులో ‘భాగ్‌ మిల్కా భాగ్‌’సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సోనమ్‌ కపూర్‌ గురించి చెప్పుకొచ్చారు. అప్పటికే ‘ఢిల్లీ 6’ సినిమా కోసం రాకేశ్‌, సోనమ్‌ కలసి పని చేశారు. ఆ పరిచయంతో రాకేశ్‌.. సోనమ్‌ను బిరో పాత్ర కోసం సంప్రదించారట. ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ లాంటి సినిమాలో భాగమైతే చాలు పారితోషికానిది ఏముంది అని ₹11 రూపాయలే తీసుకున్నారట.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus