ఈమెవరో కనిపెట్టండి చూద్దాం… సోషల్‌ మీడియా ఫ్రీక్‌ అయితే ఈజీగా చెప్పే్స్తారు!

స్టార్‌ నటుల వారసుడిగా / వారసురాలిగా ఇండస్ట్రీలోకి రావడం సులభం కావొచ్చేమో కానీ, వచ్చాక ఆ స్థానాన్ని, తమ పెద్దల పేరును స్టేబుల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది ఓ కుర్ర కథానాయిక. తెలుగు మూలాలున్న ఆమె తల్లి.. ఇక్కడ ఎంత పేరు తెచ్చుకుందో, హిందీలో అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. ఆ కథానాయిక ఫొటోనే మీరు పైన చూస్తున్నది. చిన్న పిల్ల ఫొటో పెట్టి హీరోయిన్‌ అంటారేంటి అనుకుంటున్నారా. ఇప్పటి హీరోయిన్‌ అప్పటి ఫొటో ఇది.

నిజానికి ఈ ఫొటోను నిశితంగా చూస్తే ఎవరో ఈజీగా చెప్పేయొచ్చు లేదంటే పైన మేం ఇచ్చిన క్లూతో అయినా చెప్పేయొచ్చు. మీరు ఒకవేళ ఈ చిన్నారి ఇప్పటి స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ అనుకుంటే మీరు కరెక్ట్‌ చెప్పినట్లే. లేదంటే తప్పు చెప్పినట్లు. హిందీలో బలమైన ఓపెనింగ్‌ సాధించి, ఇప్పుడు తెలుగులో ఆ స్థాయి ఓపెనింగ్‌ కోసం సినిమా చేస్తోంది జాన్వీ కపూర్‌. ఈ క్రమంలో నాటి పాత ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జాన్వీ  (Janhvi Kapoor) సినిమాల సంగతి చూస్తే… తెలుగులో ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌లో జాన్వీ మీద కొన్ని క్లోజప్‌ షాట్లు తీసి ముగించారు. త్వరలో పూర్తి స్థాయి చిత్రీకరణ ఉంటుంది అంటున్నారు. ఇక సౌత్‌లో రెండో సినిమా కూడా తెలుగులోనే ఉంటుంది అన్నారు. అయితే ఇప్పుడు తమిళంలో అంటున్నారు. ఆ విషయంలో క్లారిటీ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. తెలుగులో అయితే ఆ హీరో రామ్‌చరణ్‌ అని టాక్‌.

రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సినిమాలో ఓ నాయికగా జాన్వీని అనుకుంటున్నారట. ఇందులో రెండో హీరోయిన్‌ కూడా ఉంది అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో జాన్వీ ఉందా లేదా అనే క్లారిటీ లేదు. ఈ సినిమాలు కాకుండా బాలీవుడ్‌లో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి’, ‘ఉలజ్‌’ అనే సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు త్వరలో మరికొన్ని సౌత్‌ సినిమాలు చేస్తుంది అని కూడా అంటున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus