సాధారణంగా.. నటులైనా.. నటీమణులైనా… తమ తమ ఆస్తులు పెంచుకుంటారు.వాటిని పెంచుకునేం దుకు అనేక రూపాల్లో ప్రయత్నాలు కూడా చేస్తారు. దీనికి గాను అహోరాత్రులు శ్రమిస్తారు కూడా.. హీరోలు.. హీరోయిన్లు.. చాలా జాగ్రత్తగా రూపాయిరూపాయి కూడబెట్టిన పరిస్థితి ఉంది. అయితే.. ఇలానే రూపాయి రూపాయి కూడబెట్టిన అగ్రతార.. చివరకు ఆ సొమ్మును మూడు భాగాలు చేసి.. పంచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె.. ఎవరో కాదు.. సువర్ణసుందరి అంజలీదేవి. ఆమె జీవితంలో అత్యంతవేగంగా అత్యంత సునాయా సంగా తన టాలెంట్‌ను నిరూపించుకుని ఇండస్ట్రీలో డెవలప్ అయ్యారు.
చేసిన వేషాలతోపాటు.. వేయని వేషాలు కూడా ఉన్నాయి. సంగీత దర్శకుడు ఆదినారాయణరావును ప్రేమించి వివాహం చేసుకున్న అంజలీదేవి.. సినిమాలు కూడా నిర్మించారు.అయితే.. ఎక్కడా వృథా గా మాత్రం ఖర్చు చేసేవారు కాదు. ఏడాదిలో రెండు సార్లు తిరుమలకు వెళ్లేవారు. తర్వాత.. తమ పెళ్లిరోజున ఇండస్ట్రీలో స్పాట్‌లో ఉన్నవా రికి ఫైవ్ స్టార్ హోటర్ రుచులను పరిచయం చేసేవారు. ఇంత జాగ్రత్తగా రూపాయి రూపాయి పోగు చేసిన అంజలీదేవి జీవితం..
ఆమె (Heroine) భర్త, సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు మృతితో మారిపోయింది. ఆమెకు ధన సంపాదనకన్నా.. ఆధ్యాత్మిక సంపాదనపై అనురక్తి కలిగింది. ముఖ్యంగా ఆమె పుట్టపర్తి సాయిబాబా, షిరిడీ సాయిబాబాల భక్తురాలిగా మారిపోయింది. ఒకానొక దశలో పుట్టపర్తిలోనే ఏడాది కాలం ఉండిపోయారు. కుటుంబ బాధ్యతలను పిల్లలకు వదిలేసిన అంజలీదేవి..
చివరి రోజుల్లో షిరిడీ సాయి,పుట్టపర్తి సాయిలనే నమ్ముకున్నారు. ఈ క్రమంలోనే తన 800 కోట్ల ఆస్తిని మూడు భాగాలుగా చేసి.. ఒకటి తన పిల్లలకు.. మిగిలిన రెండు భాగాలను ఒకటి షిరిడీ, రెండు పుట్టపర్తి సాయి బాబాలకు విరాళంగా ఇచ్చేశారు.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు