గాయాలు పాలయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్ స్టార్ హీరొయిన్ కత్రినా కైఫ్… గత కొంత కాలంగా సరైన హిట్ అందుకోలేక పోయింది. ఎన్నో అసలు పెట్టుకున్న ‘ధగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ ‘జీరో’ చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఒక్క హిట్టు కోసం చాలా కష్టపడుతుంది కత్రినా.దీనికోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి కత్రినా సిద్ధంగా ఉందట. ఇందులో భాగంగా ఓ చిత్ర షూటింగ్లో భారీ యాక్షన్ ఎపిసోడ్లో పాల్గొని గాయాలు పాలయ్యిందట కత్రినా.

ప్రస్తుతం కత్రినా.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘భారత్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో భాగంగా పాల్గొన్న ఓ యాక్షన్ సీన్‌లో కత్రినా ప్రమాదానికి గురయ్యిందట. దీంతో ఆమె కాలుకు బలమైన గాయం తగిలిందట. దీంతో షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చింది కత్రినా. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యిందట. సల్మాన్‌ ఖాన్ తో కత్రినాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్ని సూపర్ హిట్లు కావడంతో ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో ఎలాగైనా మంచి విజయాన్నిసాదించి బౌన్సు బ్యాక్ అవ్వాలని కత్రినా భావిస్తుందట. దిశా పటానీ ఈ చిత్రంలో సల్మాన్‌కు చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus