నేను చెప్పింది నిజమే.. ఆ రోజు నా లైఫ్ లో బిగ్ డే : స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత రెండు రోజులుగా తెగ ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోల్లో తన వేలికి డైమండ్‌ రింగ్‌ ఉండడం మన నెటిజన్లు గమనించారు. అంతేకాదు ఆ ఫొటోలకి ఆమె ఈ విధంగా స్పందించింది. ‘ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు..నేను కన్న పెద్ద కల నెరవేరబోతోంది.

అది మీతో షేర్ చేసుకోవాలనే కుతూహలం నాలో ఉంది. ఇది మీతో షేర్ చేసుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.ఇది జరిగిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను’ అంటూ రాసుకొచ్చింది. అంతే సోనాక్షి పెళ్లి చేసుకోబోతుంది అనే ప్రచారం మొదలైంది. ఈ కామెంట్ల పై.. తనపై వస్తున్న ఎంగేజ్మెంట్ వార్తల పై ఆమె స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “ఓకె ఓకె.. నేను మిమ్మల్ని బాగా ఆటపట్టించాలని అనుకుంటున్నా. నేను ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఎన్నో క్లూలు ఇవ్వడం జరిగింది.

నేను చెప్పినట్టుగానే ఆ రోజు నాకు బిగ్‌ డే..! నా సొంత నెయిల్‌ పాలిష్‌ బ్రాండ్‌ సోయిజీని ప్రారంభించే రోజు నాకు గొప్ప రోజే కదా. అందమైన నెయిల్స్‌ కోసం ప్రతి అమ్మాయికి ఇదే చివరి గమ్యం అవుతుంది. నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి నా బిగ్గెస్ట్ డ్రీమ్‌ను నిజం చేసుకున్నాను. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను.

సోయిజీ నెయిల్‌ పాలిష్‌ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా ప్రేమను పంచుకున్న. మీరు ఏమనుకున్నారు? హాహ్హాహ్హా.. లవ్‌ యూ గాయ్స్‌! మీరు ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్‌” అంటూ రాసుకొచ్చింది. ఓ రకంగా నేను అందరినీ ఫూల్ చేశాను అన్నట్టు ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus