2020 లో రిలీజ్ కానున్న భారీ సినిమాలు!

విజన్ 2020 .. ఇది రాజకీయ నాయకుల మంత్రమే కాదు… ఇప్పుడు స్టార్ హీరో, డైరక్టర్ల మాట అయింది. వచ్చే ఏడాది సినిమాలను రిలీజ్ చేసే ఆలోచనని పక్కన పెట్టి.. 2020 లో గ్రాండ్ గా రావాలని స్టార్ హీరోలు ప్లాన్ వేశారు. వాటిలో ఎక్కువ క్రేజ్ కలిగిన ప్రాజక్ట్ #RRR. బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం.. మెగా హీరో రామ్ చరణ్ తేజ్.. నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడం.. వంటి అంశాలు ఈ సినిమాపై  అంచనాను పెంచాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని 2020 లో రిలీజ్ చేయాలనీ రాజమౌళి టార్గెట్ ఫిక్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా 2020 పై గురిపెట్టారు. ప్రస్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు.

ఈ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్లనుంది. వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న కొరటాల చేస్తున్న ప్రాజక్ట్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నారు. అలాగే 2020 లో రిలీజ్ కానున్న సినిమాల్లో ఆసక్తి కలిగించే మూవీల్లో ముందు వరుసలో నిలిచేది సుకుమార్, మహేష్ కాంబో సినిమా. వన్.. నేనొక్కడినే అనే సినిమా ఫెయిల్ కావడంతో ఈ సారి ఎలాగైనా మహేష్ కి హిట్ ఇవ్వాలని కసితో సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ తెరకెక్కించనున్న మూవీ కావడంతో దీనిపైనా కూడా అభిమానులు హోప్స్ పెట్టుకున్నారు. మరి ఏ మూవీ అంచనాలకు మించి ఉంటుందో తెలుసుకోవాలంటే రెండేళ్లు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus