టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న గీత రచయితలలో గురు చరణ్ ఒకరు. ముద్దబంతి నవ్వులో మూగబాసలు, బోయవాని వేటుకు గాయపడిన కోయిల ఇలా ఎన్నో హిట్ పాటలకు ఆయన గీత రచయితగా పని చేశారు. గురు చరణ్ అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధ పడుతుండగా ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యుడిగా పని చేసిన గురు చరణ్ అసలు పేరు మానావరపు రాజేంద్రప్రసాద్.
Lyric Writer
రెండు వందలకు పైగా సినిమా పాటలు రాసిన గురు చరణ్ ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదని అభిమానులు భావిస్తారు. ఆయన మరణవార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా (Lyric Writer) గురు చరణ్ మృతికి సంతాపం తెలియజేయడంతో పాటు గురు చరణ్ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఇష్టమైన రచయితలలో గురు చరణ్ ఒకరు కాగా తన సినిమాలలో గురు చరణ్ రాసిన పాటలు ఉండే మోహన్ బాబు జాగ్రత్తలు తీసుకునేవారు. నాకు ఇష్టమైన పాటల రచయిత గురు చరణ్ అని మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గురు చరణ్ తన సినీ కెరీర్ లో ఎన్నో మెలోడీ పాటలతో పాటు అర్ధవంతమైన పాటలను రాసి తన రైటింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు.
గురు చరణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. ఈయన డైరెక్టర్ మానావరపు అప్పారావు, నటి ఎంఆర్ తిలకం దంపతుల కుమారుడు కాగా ఆయన రాసిన సాంగ్స్ లో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. గురు చరణ్ మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. (Lyric Writer) గురు చరణ్ ను కోల్పోవడం బాధ కలిగించిందని చంద్రబోస్ కామెంట్లు చేశారు.