Ram Charan: రామ్‌ చరణ్‌ – బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్‌ ఆయనే.. ఫ్యాన్స్‌కి టెన్షన్‌ మొదలు!

సైలెంట్‌ కిల్లర్‌ అని అంటారు తెలుసా? అంటే సప్పుడు లేకుండా వచ్చి.. అదిరిపోయే ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తే ఈ మాట వాడుతుంటారు. అయితే దీనిని సినిమాలకు ఆపాదిస్తే ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి భారీ విజయం అందుకోవడం. లేదంటే ఎలాంటి హడావుడి లేకుండా భారీ సినిమాకు అంతా సిద్ధం చేయడం అని అనొచ్చు. అలాంటి సైలెంట్‌ కిల్లర్‌ ఒకటి టాలీవుడ్‌లో రెడీ అవుతోంది అని చెప్పొచ్చు. అది మరే సినిమానో కాదు రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సినిమానే. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వస్తున్నాయి. అన్నీ భారీ ఇంపాక్ట్‌ ఉన్నవే.

ఇన్నాళ్లుగా (Ram Charan) రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సినిమా గురించి వస్తున్న వార్తలు / పుకార్లలో ఒకటి ఫైనల్‌ అయ్యింది. అదే ఏఆర్‌ రెహమాన్‌. అవును మీరు చదివింది కరెక్టే. ఈ సినిమాకు రెహమాన్‌ పని చేస్తున్నారట. ఈ మేరకు ఆయన ఆల్‌మోస్ట్‌ ఓకే చెప్పేశారట. ప్రస్తుతం డిస్కషన్స్‌ నడుస్తున్నాయని తెలిపారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన రెహమాన్‌ను మీడియా రామ్‌చరణ్‌ సినిమా గురించి అడిగింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్‌కి ఓవైపు కిక్‌ ఇస్తే.. మరోవైపు భయాన్ని కలిగిస్తోంది.

ముందుగా రెహమాన్‌ ఏమన్నారో చూద్దాం. తర్వాత ఫ్యాన్స్‌ భయం చూద్దాం. ‘‘రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సినిమాకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. నేను చేస్తున్న సినిమాల్లో అదొక ఆసక్తికరమైన చిత్రం. సినిమా కథ నేపథ్యం, వివరాల గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ ఈ సినిమా చాలా ప్రత్యేకమైన కథతో రూపొందుతోంది’’ అని రెహమాన్‌ వివరించారు. దీంతో ఫ్యాన్స్‌ హైప్‌, బజ్‌ భారీగా పెరిగింది. అయితే గతంలో రెహమాన్‌ సినిమాల ట్రాక్‌ రికార్డు గుర్తు చేసుకుని భయపడుతున్నారు.

దానికి కారణం ఆయన స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తే.. ఆ ఫలితం చేదుగానే ఉంది. అదే తమిళ సినిమాలు చేసి అవి డబ్బింగ్‌ అయితే అదిరిపోతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో అని టెన్షన్‌ పడుతున్నారు. చూద్దాం రెహమాన్‌ పాత మాటను చెరిపేసుకుంటారేమో. అన్నట్లు పూర్తిగా ఇది సెంటిమెంట్‌ మాత్రమే.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus