ప్రియుడితో రొమాంటిక్ పిక్ షేర్ చేసిన నిర్మాత కూతురు, స్టార్ హీరో సిస్టర్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్స్, బ్రేకప్స్, రిలేషన్ షిప్స్, ఎఫైర్స్ కామన్.. దాదాపుగా అన్నీ సీక్రెట్‌గానే జరిగిపోతుంటాయి.. ఓవైపు లవ్ చేసుకున్న వాళ్లు నిశ్చితార్థాలు కానిచ్చేసి, పెళ్లికి రెడీ అవుతున్నారు.. మరోపక్క వెడ్డింగ్ అయిన వాళ్లు విడాకులు తీసుకుంటున్నారు.. తమన్నా, అదితి రావు హైదరీ, పరిణీతి చోప్రా లాంటి వాళ్లు బాయ్ ఫ్రెండ్స్‌తో కెమెరాల కంటపడితే.. మేటర్ ఏంటని అడిగితే.. మేం మంచి ఫ్రెండ్స్, మా మధ్య అలాంటిదేం లేదు అని సమాధానం దాటవేస్తున్నారు..

అయితే రీసెంట్‌గా ఓ ప్రముఖ నిర్మాత కూతురు తన ప్రియుడితో కలిసున్న సాలిడ్ రొమాంటిక్ పిక్ షేర్ చేసి తన రిలేషన్ మేటర్ రివీల్ చేయడంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఆ బడా ప్రొడ్యూసర్ ఎవరో కాదు బోనీ కపూర్.. శ్రీదేవి కంటే ముందు ఆయనకి మొదటి భార్య మోనా కపూర్‌తో అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరు సంతానం.. అర్జున్ కొద్దికాలంగా మలైకా అరోరాతో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే..

స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌తో అన్షులా డేటింగ్ డేటింగ్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఆ న్యూస్ నిజమేనంటూ తాజాగా ప్రియుడితో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న పిక్ షేర్ చేసింది.. ఇద్దరూ కళ్లల్లోకి కళ్లు పెట్టి ప్రేమగా చూసుకుంటూ.. ఒకరినొకరు హత్తుకున్న రొమాంటిక్ ఫోటో చూసి అంతా షాక్ అవుతున్నారు.. ఇక ఆ ఫోటోకి హార్ట్ ఎమోజీతో పాటు 366 అనే క్యాప్షన్ యాడ్ చేసింది..

అంతేకాదు, తాము మాల్దీవుల్లో ఉన్నట్లు లొకేషన్ కూడా ట్యాగ్ కూడా జతచేసింది.. అమ్మడు ఓపెన్‌గా లవ్ మేటర్ రివీల్ చేయడంతో నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు.. త్వరలోనే అన్షులా – రోహన్ పెళ్లిపీటలెక్కబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి అన్షులా లవ్ సంగతి తల్లి మోనా, తండ్రి బోనీ కపూర్, అన్నయ్య అర్జున్ కపూర్‌లకు తెలుసో, లేదో.. వాళ్లెలా స్పందిస్తారో చూడాలి..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus