ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాకి దాదాపు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాలీవుడ్ మీడియా కూడా 4 రేటింగ్ ఇచ్చింది. కానీ కొందరు మాత్రం సినిమాకి నెగెటివ్ రివ్యూ ఇచ్చారు. అసలు సినిమాలో కథే లేదని.. ఎమోషన్ మిస్ అయిందంటూ రివ్యూలు రాశారు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.
సినిమా బాగున్నా.. హీరోల పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉన్నా కూడా నెగెటివ్ రివ్యూలు రాయడంతో మండిపడుతున్నారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత పీవీపీ కూడా నెగెటివ్ రివ్యూలపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అందులో ఆయన ఏమని రాశారంటే..? ”కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి.. జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి.. మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి.
నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఉంది.. కానీ సొంత అభిప్రాయాలకు, వార్తలకు సన్నని తీగలాంటి తేడా ఉంటుందని గమనించండి. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయడంలో క్లాసులు పీకుతారు.. సినీప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి..” అంటూ సలహా కూడా ఇచ్చారు.
పీవీపీ పెట్టిన ఈ ట్వీట్ పై అభిమానులు బాగానే రియాక్ట్ అవుతున్నారు. నెగెటివ్ రివ్యూలు రాసేవారిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ బ్యాక్ బోన్ గా నిలిచారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?