సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. ఆల్రెడీ ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), కోలీవుడ్ కమెడియన్ శేషు,డేనియల్ బాలాజీ (Daniel Balaji) , రచయిత శ్రీ రామకృష్ణ,సీనియర్ కమెడియన్ విశ్వేశ్వరరావు వంటి వారు మరణించారు.
ఈ షాక్..ల నుండీ సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో నిర్మాత మరణించడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత అయిన గంగూ రామ్ సే మృతి చెందారు. నెల రోజుల నుండీ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నిన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 83 ఏళ్ళు కావడం వల్ల శక్తి లేక వీక్ అయిపోయినట్టు..
ట్రీట్మెంట్ కి కూడా ఆయన శరీరం సహకరించినట్లు.. వారు చెప్పుకొచ్చారు. ‘పురానీ హవేలీ’ ‘టేఖానా’ వంటి హార్రర్ చిత్రాలని ఆయన రూపొందించారు. అలాగే ‘ఖిలాడి’ ‘ఆషిక్’ ‘ఆవారా’ వంటి చిత్రాలకు కూడా ఆయన పని చేయడం జరిగింది. ఆయన స్నేహితులతో కలిసి మొత్తంగా 50 చిత్రాలు నిర్మించారు గంగూ. ఇలాంటి గొప్ప ఫిలిం మేకర్ మరణించడం అనేది సినీ పరిశ్రమకి తీరని లోటుగా కొందరు భావిస్తున్నారు.