సినీ ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి బుధవారం నాడు కన్నుమూశారు.బుధవారం నాడు అంటే మే 25న ఆయన చెన్నై ఆసుపత్రిలో మరణించినట్టు తెలుస్తుంది. 1948 వ సంవత్సరం నెల్లూరు జిల్లాకి చెందిన గూడూరులో ఆయన జన్మించారు. ఈయన తల్లి పేరు మస్తానమ్మ, తండ్రి పేరు ఎం.సుబ్బరామిరెడ్డి. మైసూర్ విశ్వ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన ఈయన మొదట సిమెంట్ రేకుల వ్యాపారం చేసేవారు. తర్వాత ఎం.ఎస్.రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈయన నిర్మాతగా మారారు.
‘ అభిమనవంటులు ‘ అనే చిత్రాన్ని నిర్మించి… దాని ద్వారా శోభా నాయుడు, ఫటా ఫట్ జయలక్ష్మీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఎం.రామకృష్ణారెడ్డి గారు. అటు తర్వాత వైకుంఠపాళి, గడుసు పిల్లాడు, మావూరి దేవత, సీతాపతి సంసారం,అగ్ని కెరటాలు, అల్లుడుగారు జిందాబాద్ వంటి చిత్రాలు నిర్మించారు.అలాగే వాకడ అప్పారావు గారితో కలిసి మూడిళ్ళ ముచ్చట చిత్రాన్ని నిర్మించారు. అమ్మోరు తల్లి అనే చిత్రాన్ని డబ్బింగ్ కూడా చేశారు.
ఎం.రామకృష్ణారెడ్డి గారికి ఇద్దరి కుమారులు ఉన్నారు. ఇక ఈయన మరణానికి చింతిస్తూ టాలీవుడ్ పెద్దలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.