టాలీవుడ్ దర్శకులలో రాజమౌళి తరువాత ఒక ప్లాప్ కూడా లేకుండా డైరెక్ట్ చేసిన ప్రతి మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. ఇప్పటివరకు 8 సినిమాలకి దర్శకత్వం వహించిన ఈ యంగ్ డైరెక్టర్ కామెడీ జానర్ ని గట్టిగా నమ్ముకున్నాడు. మధ్యలో బాలయ్య బాబు తో ‘భగవంత్ కేసరి’ వంటి లోతైన కధాంశం ఉన్న సినిమా కూడా రూపొందించి సక్సెస్ అయ్యాడు రావిపూడి.
అయినా కూడా ట్రోల్ల్స్ బాధ తప్పలేదు ఈ యంగ్ డైరెక్టర్ కి. క్రింజ్ కామెడీతో విసుగుపుట్టిస్తున్నాడు అంటూ కొందరు, సంక్రాంతి పండగ ముసుగులో ఫ్యామిలీ ఆడియన్స్ గట్టెకించేస్తున్నారు అంటూ మరి కొందరు చాలా దారుణంగా ట్రోల్ల్స్ చేస్తూ వచ్చారు. కానీ అవేమి పట్టించుకోకుండా అనిల్ రావిపూడి తన టాలెంట్ ను మాత్రమే నమ్ముకుంటూ వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 2025 ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో అనిల్ సృష్టించిన ప్రభంజనమే. వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ & మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కిన ఈ తెలుగు మూవీ రికార్డులను బ్రేక్ చేస్తూ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సంగతి అందరికి తెల్సిందే.

ప్రస్తుతం అనిల్, మెగా స్టార్ చిరంజీవితో మూవీ డైరెక్ట్ చేస్తుండగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్ తో 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా , ఈ మధ్యనే ఫస్ట్ సింగిల్ ‘మీసాలపిల్ల’ సాంగ్ నెట్టింట చాలా ట్రోలింగ్ కి గురైంది. కానీ ఈ సాంగ్ ట్రోల్ల్స్ అన్నిటిని తిప్పికొడుతూ 80+ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతోపాటు 3 రిలీజ్ అయిన శశిరేఖ లిరికల్ వీడియో 20+ మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ లో ఉంది. దీనిపై మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్ల్స్ ను తాను పట్టించుకోనని, తన పని తాను చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కంటెంట్ లో విషయం ఉంటే ట్రోల్ల్స్ కి బయపడనక్కర్లేదని ఇండైరేక్ట్ గా కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
