సిల్క్ స్మిత ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒక్కప్పుడు తన గ్లామర్ తో సౌత్ తో పాటు నార్త్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ‘చూడటానికి నల్లగా ఉన్నావు.. నీకు సినిమా ఛాన్సులు ఎలా వస్తాయి అనుకున్నావ్?’ అంటూ ఆమెపై అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయట.దీంతో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఐటెం గర్ల్ అవతారం ఎత్తింది. హుషారుగా డాన్స్ చేయడంతో పాటు అందాలు వడ్డించడంలో ఈమె అందరినీ మించిపోయింది.
అందుకే ఈమెకు భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. తర్వాత స్లోగా సినిమాల్లో కూడా అవకాశాలు పొందింది. సినిమాలో సిల్క్ స్మిత ఐటెం సాంగ్ ఉందంటే చాలు మాస్ ఆడియన్స్ ఎగబడి థియేటర్స్ కి వెళ్ళేవాళ్ళు. అయితే తర్వాత ఈమెను చాలా మంది భామలు కాపీ కొట్టడంతో.. ఈమె డిమాండ్ తగ్గింది.తర్వాత ఆఫర్స్ కరువయ్యాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే… సూసైడ్ చేసుకుని చనిపోయింది సిల్క్ స్మిత. ఈమె మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీనే అని అంతా చెబుతుంటారు.

అయితే సిల్క్ స్మిత ఓ సీరియల్లో కూడా నటించింది అనే సంగతి మీకు తెలుసా? వినడానికి విడ్డూరంగా ఉన్నా అది నిజం. సిల్క్ స్మిత ఓ సీరియల్లో నటించారు. ఇటీవల ఆ సీరియల్ దర్శకుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. అతని పేరు దళపతి. ఇటీవల అతను మాట్లాడుతూ.. “సిల్క్ స్మిత ఓ సీరియల్లో నటించారు అనే సంగతి చాలా మందికి తెలీదు. ఆమె నటించిన ఒకే ఒక్క సీరియల్ కళ్యాణ పండల్.
నేనే ఆ సీరియల్ ని డైరెక్ట్ చేశాను. ఆ టైంలో ఆమెతో నాకు స్నేహం ఏర్పడింది. నా మొదటి సినిమాలో ఆమెను ఎంపిక చేసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
