ఫైనాన్సియల్ ఇష్యూస్ వలన ‘అఖండ 2 తాండవం’ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ ఆగిపోవటం , ఆ తరువాత జరుగుతున్న వరుస పరిణామాలు అందరికి తెలిసినవే. అయితే ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఆ రోజు నుంచే అఖండ 2 రిలీజ్ కోసం తమ వంతుగా కృషి చేస్తున్నట్లు సమాచారం. ఎట్టకేలకు మూవీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఆఫీసియల్ గా మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 11న ప్రీమియర్ షోస్ తో బాలయ్య అఖండ 2 తాండవం ఆగమనానికి సిద్ధమైంది.ఈ శుక్రవారం 12వ తేదీన రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వగా, బాలయ్య అభిమానులు ఉత్సాహంతో రెడీగా ఉన్నారు.
మరోవైపు డిసెంబర్ 12న రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్న చిన్న సినిమాలు, బాలయ్య అఖండ2 అదే రోజు వస్తున్నాం అని తెలియజేయడంతో దిక్కు తోచని పరిస్థితిలో ఎం చేయాలో తెలీక మల్లగుల్లాలు పడుతున్నారు. అదే రోజు రిలీజ్ చేద్దాం అనుకున్న నందు హీరోగా నటించిన ‘సైక్ సిద్దార్థ్’ మూవీ తమ రిలీజ్ డేట్ అప్డేట్ పై ఒక వీడియో బైట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో హీరో నందు తో పాటు రానా కూడా ఉన్నారు.

వీరిద్దరూ సరదాగా సంభాషించుకుంటూ “నందు రానాతో అన్న మనం ఇంకో మూడు రోజుల్లో వస్తున్నాం అని ఆతృతగా చెప్పటంతో రానా , బాలయ్య వస్తున్నారు కదా అనటంతో కన్ఫర్మా అంటే అవును జై బాలయ్య అంటూ వీడియో ముగించారు. బాలయ్య బాబు మీద ఉన్న అభిమానంతో తమ సినిమా సైక్ సిద్దార్థ్ విడుదలను డిసెంబర్ 12 నుంచి 2026 జనవరి 1 కి మార్చినట్టు తెలిపారు. కొత్త సంవత్సరం రోజున వేరే సినిమాలు కూడా పోటీ లేకపోవటంతో మంచి నిర్ణయం తీసుకున్నారు అని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
