సినిమా షూటింగ్స్ లో హీరోలు గాయపడటం సాధారణంగా జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే గాయం అయిన తరువాత కూడా చికిత్స చేయించుకుని షూటింగ్ లో పాల్గొనే నటులు అరుదుగా ఉంటారు. అలాంటి నటులలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి నటుడు, అర్ధశతాబ్దం నిర్మాత రాధాకృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆది సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన రాధాకృష్ణ ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకతోనే ఆర్టిస్ట్ అని ఎన్టీఆర్ ఎనర్జీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదని రాధాకృష్ణ వెల్లడించారు. ఆది సినిమా క్లైమాక్స్ ఫైట్ ను గోల్కొండ స్కూల్ లో ప్లాన్ చేశామని సీన్ లో భాగంగా ఫోటో ఫ్రేమ్ గ్లాస్ ను గుద్దాల్సి ఉండగా ఆ సీన్ సమయంలో ఎన్టీఆర్ కు గాయమైందని రాధాకృష్ణ అన్నారు. చేతిలో గాజు ముక్కలు దిగినా ఎన్టీఆర్ ఆస్పత్రికి వెళ్లి కుట్లు వేయించుకొని షూటింగ్ పూర్తి చేశాడని రాధాకృష్ణ పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ అలాంటిది అంటూ రాధాకృష్ణ ఎన్టీఆర్ గురించి పాజిటివ్ కామెంట్లు చేశారు. మరోవైపు రాధాకృష్ణ నిర్మాతగా వచ్చిన అర్ధశతాబ్దం సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అజయ్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్రతో పాటు మరి కొందరు ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?