Parasuram: పరశురామ్.. తప్పేముందని అంతా అతన్నే టార్గెట్ చేస్తున్నారు..!

పరశురామ్ పెట్ల అలియాస్ బుజ్జి పై కొంతకాలంగా నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ నాగ చైతన్య వంటి కూల్ బాయ్ కూడా ‘పరశురామ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్’ అంటూ కామెంట్ చేయడం అతని పై నెగిటివిటీ ఇంకా పెరిగేలా చేశాయి. అంతేకాకుండా ఇటీవల అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. ఓ సినిమా వేదికపై ‘నా వల్ల పైకొచ్చిన దర్శకులు ఉన్నారు.. మా గీత దాటి సినిమాలు చేశారు’ అంటూ ఓ సెటైర్ వేసి ఆ తర్వాత ‘దర్శకుడు చందూ మొండేటి నా బ్యానర్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్న టైంలో అతనికి వేరే బ్యానర్ల నుండి చాలా టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చాయి.

అయినా అతను సిన్సియర్ గా ఉన్నాడు’ అని ఓ కవర్ డ్రైవ్ వేశారు. తన బ్యానర్లో (Parasuram) పరశురామ్ సినిమా చేయకుండా వెళ్ళిపోయాడు అని పరోక్షంగా అల్లు అరవింద్ కామెంట్ చేసినట్టు అయ్యింది. అయితే పరశురామ్ నే ఎందుకు సాఫ్ట్ కార్నర్ చేస్తున్నారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్ కు అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చిన మాట నిజం. అటు తర్వాత ఓ కథ రెడీ చేసుకుని పరశురామ్ .. అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లను అప్రోచ్ అయిన మాట నిజం.

ఆ కథ వాళ్లకి నచ్చలేదు. అలాగే ఇంకో కథ చెప్పినా కూడా దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అవే కథలు బయట నిర్మాతలకు నచ్చాయి. అందులో ఆల్రెడీ ఓ కథ వేరే హీరోతో చేసి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు పరశురామ్. ఆ టైంలో నాగ చైతన్య ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. అతని ఫ్రస్ట్రేషన్ కి ఓ అర్థం ఉంది. కానీ అల్లు అరవింద్ గారే ‘గబ్బర్ సింగ్’ టైంలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి అడ్వాన్స్ ఇచ్చినా.. ఇప్పటివరకు సినిమా చేయమని ఇబ్బంది పెట్టడం లేదు అని స్వయంగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

మరి అతన్ని సినిమా చేయమని అల్లు అరవింద్ ఎందుకు అడగడం లేదు. 5 ఏళ్ళ క్రితం అడ్వాన్స్ ఇచ్చిన పరశురామ్ నే ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు. హరీష్ శంకర్ అనే కాదు రాజమౌళి..మహేష్ సినిమా కోసం కె.ఎల్.నారాయణ్ వద్ద అడ్వాన్స్ తీసుకున్నది విక్రమార్కుడు సినిమా టైంలో..! కానీ ఇప్పటికీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది లేదు. ఇలాగే ఇంకా చాలా మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లకి ఒక న్యాయం.. పరశురామ్ కి ఇంకో న్యాయమా..?

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus