సీక్రెట్ గా సింగర్ 3వ పెళ్లి.. అడ్డుపడిన భర్త..!

సెలబ్రిటీలకు మొదటి పెళ్లి దాదాపు సక్సెస్ అవుతుంది అని చెప్పలేము. చాలామంది సెలబ్రిటీలు రెండు పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే 3వ పెళ్లి చేసుకునే సెలబ్రిటీల లిస్ట్ కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఈ లిస్ట్ లో పాప్‌ సింగర్‌ బ్రిట్నీస్పియర్స్‌ కూడా చేరింది. ఆవు ఆమె మూడో పెళ్లి చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బ్రిట్నీస్పియర్స్‌ తన ప్రియుడు సామ్‌ అస్ఘరిని సీక్రెట్‌గా వివాహం చేసుకుంది.

అయితే బ్రిట్నీ వయసు 40 ఏళ్లు కాగా సామ్‌ వయసు కేవలం 28 ఏళ్ళు మాత్రమే. ఇదిలా ఉండగా.. వీరి వివాహాన్ని అడ్డుకోవాలని ప్రముఖ సింగర్‌ మరియు బ్రిట్నీస్పియర్స్‌ మాజీ భర్త అయిన అలెగ్జాండర్‌ ప్రయత్నించాడు. ‘బ్రిట్నీ స్పియర్‌ నాకున్న ఒకే ఒక్క భార్య. ఆమె ఎక్కడ?’ అంటూ గొడవ చేయబోతున్న సమయంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉండగా.. 2004లోనే బ్రిట్నీస్పియర్స్‌ తన బాల్యమిత్రుడైన అలెగ్జాండర్‌ను పెళ్లాడింది.

అయితే 55 గంటలకే వీరు విడిపోయారు.ఈ విషయం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత కెవిన్‌ ఫెడర్‌లైన్‌ను ను ఈమె పెళ్ళాడింది. వీరికి సీన్‌, జైడెన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.అయితే 2007లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండీ ఒంటరిగా జీవిస్తూ వచ్చిన ఈమె 2016లో స్లంబర్‌ పార్టీ అనే వీడియో సాంగ్‌లో ఈమెతో పాటు కలిసి నటించిన సామ్‌ అస్ఘరితో ప్రేమలో పడింది. గతేడాది వీరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus