Star Singer: వైరల్ అవుతున్న హల్దీ ఫంక్షన్ ఫోటోలు.!

ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో సోషల్ మీడియా బాగా విస్తరించింది. దీంతో అందులో ప్రపంచంలోని ఏ మూలన చిన్న విషయం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన ప్రతీ వార్త నిజమో.. అబద్ధమో అర్ధం చేసుకోవడం కష్టంగా మారింది.మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి పర్సనల్ విషయాలపై ప్రజలు చాలా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.

వారికి సంబంధించిన పలు విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. మరికొన్ని ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీంతో సెలబ్రెటీస్ ప్రైవసీ లైఫ్ కి భంగం కలుగుతుంది. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ సింగర్ శ్రావణ భార్గవికి సంబంధించిన ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. శ్రావణ భార్గవి సింగర్ హేమచంద్రను 2013లో ప్రేమించి పెళ్లి చేసుకుంది . వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా ఉంది.

కాకపోతే ఇటీవల వీరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయట. ఆ కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారని.. దూరం దూరంగా ఉంటున్నారట. వారిద్దరు విడాకులు కూడా తీసుకోబోతున్నాంటూ ప్రచారం జరిగింది. కాకపోతే వాటిలో నిజం లేదని వారిద్దరు అప్పట్లోనే ఆ వార్తలను ఖండించారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఏ ఫంక్షన్ లోనూ కలిసి కనిపించకపోవడంతో వీళ్లు నిజంగానే విడాకులకు అప్లై చేశారని ప్రచారం జరిగింది. కాకాపోతే కొందరు ఆకతాయిలు శ్రావణ భార్గవి తన సోదరుడి పెళ్లిలో దిగిన హల్దీ ఫంక్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తాను రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు పుట్టించారు.

తాను స్టార్ సెలబ్రిటీ కావడంతో ఈ వార్త కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వార్త విన్న శ్రావణ భార్గవి ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోయారు. అయితే ఇది కేవలం ఫేక్ వార్తని ఆమె రెండో పెళ్లి చేసుకోవడం లేదని అవి తన బ్రదర్ పెళ్లిలో దిగిన ఫోటోస్ అని స్పష్టం చేశారు (Singer) శ్రావణ భార్గవి ఫ్యాన్స్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus