స్టార్ సింగర్ పై ట్రోలింగ్.. ప్రెగ్నన్సీ కారణంగానే!

అమెరికన్ పాప్ సింగర్ రిహానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది.తన బాయ్ ఫ్రెండ్ రాకీతో కలిసి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది రిహానా. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే పెళ్లి చేసుకోకుండా గర్భం దాల్చడం కరెక్ట్ కాదంటూ కొందరు రిహానాను ట్రోల్ చేస్తున్నారు. వీరిలో ప్రముఖ నైజీరియన్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌ డేనియల్‌ రెఘా కూడా ఉన్నాడు. పొగడాల్సినంత గొప్ప పని రిహానా చేయలేదని అన్నాడు. సెలబ్రిటీలు అయినా.. మామూలు మనుషులైనా..

పెళ్లి చేసుకున్న తరువాత పిల్లల్ని కనడం సరైన పని అని చెప్పుకొచ్చారాయన. రిహానా ప్రెగ్నన్సీను ఉద్దేశిస్తూ.. ఈ పరిస్థితి నుంచి బయటపడేయడానికి మనల్ని ఆ దేవుడే కాపాడాలంటూ జెనరలైజ్ చేసి మాట్లాడారు. అంతేకాదు.. ఒక అమ్మాయి పెళ్లికి ముందే గర్భం దాల్చడానికి మగాడికి అనుమతి ఇస్తుందంటే.. ఆమె విలువ ఆమెకి తెలియనట్లే అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నాడు. ఒక వ్యక్తి నిజంగానే ప్రేమిస్తే ముందు ఎదురుకట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకొని ఆ తరువాత కుటుంబాన్ని ప్రారంభించాలని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ ట్వీట్స్ పై రిహానా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు నీ అభిప్రాయం ఎవరడిగారని డేనియల్ పై ఫైర్ అవుతున్నారు. రిహానాకు ముప్పై ఏళ్లని.. ఎప్పుడేం చేయాలో.. ఏం చేయకూడదో ఆమెకి తెలుసని సమాధానాలు ఇస్తున్నారు. తన టాలెంట్ తో సింగర్ గా.. ఆ తరువాత బిజినెస్ విమెన్ గా ఎదిగిన రిహానా.. వందల కోట్లు సంపాదిస్తోంది. ఆమె పాటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

తన పాటలకు ఎన్నో అవార్డ్స్ అందుకుంది ఈ పాప్ సింగర్. గ్రామీ, అమెరికన్‌ మ్యూజిక్, బిల్‌బోర్డ్‌ మ్యూజిక్, బీఆర్‌ఐటీ వంటి అవార్డులను పదుల సంఖ్యలో అందుకుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus