ఈ మధ్య కాలంలో వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. కోవిడ్ కారణంగా కొంతమంది, అనారోగ్య సమస్యలతో ఇంకొంతమంది, ఆత్మహత్య చేసుకుని కొంతమంది, వయసు మీద పడటంతో కొంతమంది.. ఇలా చాలామంది మరణించారు. ఇటీవల కృష్ణంరాజు, కృష్ణ వంటి లెజెండరీ హీరోలతో పాటు ఇంకొంతమంది నటీనటులు మరణించారు. టాలీవుడ్ లో అనే కాకుండా మిగిలిన సినీ పరిశ్రమల్లో కూడా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది.
ఇదిలా ఉండగా..తాజాగా ఓ సింగర్ పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే మరణించడం అందరినీ కలచివేసింది అనే చెప్పాలి.వివరాల్లోకి వెళితే.. ప్రముఖ సింగర్, రచయిత జెక్ ఫ్లింట్ మృతి చెందారు.అతని మేనేజర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జెక్ తన సోషల్ మీడియా ద్వారా బ్రెండా విల్సన్ కు దగ్గరయ్యాడు. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారడంతో… ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి శనివారం నాడు జెక్ ఫ్లింట్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వాళ్ళ పద్దతిలో ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు.
అయితే ఎవ్వరూ ఊహించని విధంగా… మరుసటి రోజు రాత్రి నిద్రలోనే జెక్ ఫ్లింట్ కన్నుమూశాడు. ఇతని వయసు 37 ఏళ్ళు మాత్రమే. ఇక తన భర్త మృతి చెందాడు అనే వార్తను బ్రెండా విల్సన్… జీర్ణించుకోలేకపోతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ‘నాకు వచ్చిన ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. నా ఆనందం.. సంతోషం నా భర్తతో వెళ్లిపోయాయి. ఆయన మళ్లీ తిరిగి రావాలి.
ఈ టైంలో నేను ఆనందంగా నా భర్తతో కలిసి.. పెళ్లి ఫోటోలు చూసుకోవాలి.. కానీ ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాల్సిన దుస్థితి ఏర్పడింది.. నా భర్త లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను’ అంటూ ఫేస్ బుక్ లో ఎమోషనల్ కామెంట్స్ చేసింది.